గుండె ముక్కలైంది.. రణ్‌బీర్‌కు మనోధైర్యం.. రిషికపూర్ మృతితో విషాదంలో పవన్, మహేష్

బాలీవుడ్ నట దిగ్గజం రిషి కపూర్ మరణవార్తతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతివార్తతో సినీ ప్రముఖులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆయన లేరనే వార్తను జీర్ణించుకోవడానికి కష్టంగా మారిందని పేర్కొంటున్నారు. ఆయన లేని లోటును, ఆయనతో ఉన్న అనుభూతులను సోషల్ మీడియాలో వెల్లడించారు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నానీ తదితరులు ట్వీట్ చేసి సంతాపం తెలిపారు. వివరాల్లోకి వెళితే..

హృదయం ముక్కలైంది.. మహేష్ బాబు

హృదయం ముక్కలైంది.. మహేష్ బాబు

బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ సార్ మరణవార్తతో హృదయం ముక్కలైంది. ప్రపంచ సినిమాకు మరో తీరని నష్టం. వెండితెరపై వినోదంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన నటుడు. పుష్కలమైన ప్రతిభ కలిగిన యాక్టర్. నిజమైన లెజెండ్ లేరనే వార్త నన్ను కలిచి వేస్తున్నది. రణ్‌బీర్ కపూర్‌కు, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం, వారికి మనోస్థైర్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకొంటున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలిని ప్రార్థిస్తున్నాను అని మహేష్‌బాబు ట్వీట్ చేశారు.

తీరని లోటు.. పవన్ కల్యాణ్

తీరని లోటు.. పవన్ కల్యాణ్

రిషికపూర్ ఆకస్మిక మరణం నన్ను తీవ్ర విషాదానికి గురిచేసింది. శ్రీ రిషికపూర్ మరణం భారతీయ సినిమాకు తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆయన ఏ లోకాన ఉన్నా ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

తీవ్రంగా కలిచివేసింది.. శ్రీనువైట్ల

తీవ్రంగా కలిచివేసింది.. శ్రీనువైట్ల

సినియర్ నటుడు, లెజెండ్ రిషి కపూర్ సార్ మరణం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఆ వార్తతో పూర్తిగా విషాదంలో మునిగిపోయాను. భారతీయ సినిమాకు ఆయన సేవలు, ఆయన కరిష్మా శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన కుటుంబానికి నా తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. రిషి ఆత్మకు శాంతి చేకూరాలి అని దర్శకుడు శ్రీనువైట్ల ట్విట్ చేశారు.

Recommended Video

#RishiKapoor : Celebrities And Politicians Pay Tribute To Rishi Kapoor
చరిత్రలో ఆయన జీవితం

చరిత్రలో ఆయన జీవితం

లెజెండ్స్‌కు మరణం లేదు. వారి జీవితం ఎప్పటికీ శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది అని హీరోయిన్ మెహ్రీన్ ఫిర్జాదా సంతాపం ప్రకటించారు. రిషి కపూర్ మరణంతో తాను విషాదంలో మునిగిపోయానని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X