సినియర్ టాప్ హీరో ‘గే’ ప్రవర్తన!
బాలీవుడ్ లో ఒకప్పటి టాప్ హీరో రిషి కపూర్ తర్వలో 'గే" ప్రవర్తనతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కరణ్ జోహార్ రూపొందించ బోతున్న 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" సినిమాలో రిషి కపూర్ ఈ పాత్ర చేయబోతున్నారు. వాస్తవానికి ఈ పాత్రను షారుఖ్ తో చేయించాలని కరణ్ భావించారట. కానీ షారుఖ్ సుముఖంగా లేక పోవడంతో రిషీ కపూర్ తో ఆ పాత్రను భర్తీ చేయాలనే ఆలోచనకు వచ్చాడు కరణ్.
ఈ సినిమాలో రిషి గే అయిన డీన్ పాత్రలో నటించబోతున్నట్లు బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు. ఈ పాత్ర చేయడం మళ్లీ బాలీవుడ్ లో తన వయసుకు తగిన పాత్రలతో హవా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట రిషి కపూర్. మరి 'గే" పాత్రలో రిషి ఏలా మెప్పించబోతున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
More from Filmibeat
karan johar rishi kapoor student of the year bollywood రిషి కపూర్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ బాలీవుడ్ కరణ్ జోహార్


Click it and Unblock the Notifications











