ఆక్రమిత కాశ్మీర్ పాకిస్థాన్‌దే: బాలీవుడ్ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు

రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. ఫరూక్ అబ్దుల్లా వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.

Recommended Video

బాలీవుడ్ సీనియర్ హీరో సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ పాకిస్థాన్ భజన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పాకిస్తాన్ దే అంటూ వివాదాస్పద ట్వీట్ చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పాకిస్థాన్‌కే చెందుతుంది... పాక్, భారత్ మద్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఇందులో మార్పుండదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్ ట్వీట్ చేశారు.

ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా

ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా

పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం కావాలంటూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషికపూర్. స్పందించారు. ఆయన తన ట్విట్టర్ వేదికగా... " ఫరూక్ అబ్దుల్లా గారు, నమస్కారం. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా.

 ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

జమ్ముకశ్మీర్ మనది. పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్) వారిది. ఇదే కశ్మీర్ సమస్యకు పరిష్కారం. నా వయసు 65 ఏళ్లు. చనిపోయేలోగా పాకిస్థాన్ ను చూడాలనేది నా కోరిక. మా పిల్లలు పాక్ లోకి వాళ్ల మూలాలను చూడాలని కోరుకుంటున్నా. జై మాతా దీ", అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదాస్పద ట్వీట్ సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది.

రిషి తండ్రి పృథ్వీరాజ్ క‌పూర్‌

రిషి తండ్రి పృథ్వీరాజ్ క‌పూర్‌

రిషికపూర్ పూర్వీకులు పాకిస్థాన్‌లో పెషావర్‌లో ప్రాంతంలో నివసించేవారు. 1918- 22 మధ్య కాలంలో ఆయన తాత దేవాన్ బశేశ్వర్‌నాథ్ కపూర్ అక్కడ ఓ భవంతిని నిర్మించారు. అయితే రిషి తండ్రి పృథ్వీరాజ్ క‌పూర్‌ సినీ రంగంలోకి రావడం, 1947 విభజన తర్వాత ఇండియాకు వచ్చేశారు.

 ప్రేమతో భారత్‌లో కలవాలని

ప్రేమతో భారత్‌లో కలవాలని

ఈ ట్వీట్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ప్రేమతో భారత్‌లో కలవాలని మనం నిర్ణయించుకున్నాం.... కానీ దేశం కశ్మీర్ ప్రజలను దగా చేసింది... వారి పట్ల సరిగా వ్యవహరించలేదని ఫరూక్ శనివారం విమర్శించారు. భారత్, చైనా, పాక్ లాంటి మూడు న్యూక్లియర్ శక్తులు మధ్య కశ్మీర్ లోయ ఉన్నందున స్వతంత్ర కశ్మీర్ మాటే తప్పని వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X