న్యూడ్ వీడియో : దర్శకుడిపై హాట్ హీరోయిన్ కేసు
బెంగుళూరు : తన ముఖంతో కూడిన ఫేక్ న్యూడ్ వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో, యూట్యూబ్‌లో దర్శనం ఇవ్వడంపై కన్నడ నటి రిషికా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పని చేసింది దర్శకుడు ఎస్.కె బషీద్ అని, అతనే ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో స్ర్పెడ్ అయ్యేలా చేసాడని ఆమె ఆరోపించింది.
రిషిక ప్రముఖ దర్శకుడు ఎస్.వి. రాజేంద్రసింగ్ కూతురు, కన్నడ సినీ ప్రముఖుడు ఆదిత్యకు సోదరి. ఇటీవల 'బెంకి బిరుగాలి' అనే కన్నడ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో రిషిక కూడా నటించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ముఖ్య పాత్రలో నటించాడు ఎస్.కె. బషీద్. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికే ఆయన ఈ పని చేసాడని రిషిక ఆరోపిస్తోంది.
దర్శకుడు తనను బెదిరింపులకు కూడా గురి చేసాడని రిషిక తన ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే దర్శకుడు ఎస్.కె. బషీద్‌పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు రిషిక వెల్లడించారు. బెంగుళూరు సంజయ్ నగర్ పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

ఒక నిమిషానికిపైగా ఉన్న ఆ వీడియోలో నటుడు-దర్శకుడు ఎస్.కె.బషీద్ తో రొమాన్స్ చేస్తున్నట్లు ఉంది.

గత సంవత్సరం రిషిక ఓ వివాదంలో ఇరుక్కుంది. బట్టలు వేసుకోకుండా శరీరం మొత్తాన్ని ఎండిపోయిన బురదతో కవర్ చేసుకున్న పోస్టర్లు వివాదానికి కారణం అయ్యాయి.

ఆ పోస్టర్‌కు వ్యతిరేకంగా పలు మహిళా సంఘాలు రిషికకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

తాజాగా ఇప్పుడు రిషిక సింగ్ తన వీడియోను మార్ఫించి చేసారంటూ ఫిర్యాదు చేసారు.

బెంకి బిరుగాలి సినిమాలో రిషిక సింగ్ తో పాటు ఇంకా నమిత, రేఖ, సంధ్య తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











