చెడిన పెళ్లి: ఆస్పత్రిలో చేరిన నటి రిషిక

కన్నడ టెలివిజన్ చానెళ్ల కథనం ప్రకారం - సందీప్‌తో రిషిక వివాహం ఏప్రిల్ 14వ తేదీన జరగాల్సి ఉండింది. అయితే, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు కారణమేమిటో తెలియదు. దీంతో రిషిక మానసిక ఒత్తిడికి గురై దాని ప్రభావం నాడీ వ్యవస్థపై పడినట్లు చెబుతున్నారు.
ఆమెను రాజాజీనగర్‌ో మానస ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆమె సాధారణ స్థితికి రావడం లేదని, ఆస్పత్రిలో హింసాప్రవృత్తితో వ్యవహరిస్తోందని, కొన్ని కిటికీలను కూడా ఆమె ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. తండ్రి, సోదరుడు కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆమెకు మానసికంగా ఊరట కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.
రిషికకు కేరళకు చెందిన యువకుడితో డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. గత మూడేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. ఇరు కుటుంబాలు కూడా వారి సంబంధానికి పచ్చ జెండా ఊపారు.


Click it and Unblock the Notifications











