twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెడిన పెళ్లి: ఆస్పత్రిలో చేరిన నటి రిషిక

    By Pratap
    |

    Rishika Singh
    బెంగళూరు: నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యతో నటి రిషికా సింగ్ ఆస్పత్రిలో చేరింది. ఆమె ప్రముఖ దర్శకుడు ఎస్వీ రాజేంద్ర సింగ్ బాబు కూతురు, నటుడు ఆదిత్య సోదరి. ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను గురువారం ఉదయం ఆస్పత్రిలో చేర్చారు. సందీప్ అనే వ్యాపారవేత్తతో ఆమెకు ఇంతకు ముందు నిశ్చితార్థం జరిగింది. అయితే, అది చెడిపోయింది.

    కన్నడ టెలివిజన్ చానెళ్ల కథనం ప్రకారం - సందీప్‌తో రిషిక వివాహం ఏప్రిల్ 14వ తేదీన జరగాల్సి ఉండింది. అయితే, నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఇందుకు కారణమేమిటో తెలియదు. దీంతో రిషిక మానసిక ఒత్తిడికి గురై దాని ప్రభావం నాడీ వ్యవస్థపై పడినట్లు చెబుతున్నారు.

    ఆమెను రాజాజీనగర్‌ో మానస ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆమె సాధారణ స్థితికి రావడం లేదని, ఆస్పత్రిలో హింసాప్రవృత్తితో వ్యవహరిస్తోందని, కొన్ని కిటికీలను కూడా ఆమె ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. తండ్రి, సోదరుడు కూడా ఆమె వెంటే ఉన్నారు. ఆమెకు మానసికంగా ఊరట కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు.

    రిషికకు కేరళకు చెందిన యువకుడితో డిసెంబర్‌లో నిశ్చితార్థం జరిగింది. గత మూడేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. ఇరు కుటుంబాలు కూడా వారి సంబంధానికి పచ్చ జెండా ఊపారు.

    English summary
    Rishika Singh, the daughter of veteran director SV Rajendra Singh Babu and the sister of actor Aditya, has been hospitalised earlier today (March 28) after nervous breakdown. The actress, who was engaged to a businessman named Sandeep, has broken up with him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X