హీరోయిన్ అశ్లీల వీడియో కేసు, దర్శకుడికి బెయిల్

మే 2న రిషికా సింగ్ బెంగుళూరులోని సంజయ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్శకుడు ఎస్‌కె బషీద్ బుధవారం(మే 15)న బెంగుళూరులోని కోర్టులో లొంగి పోయారు. బషీద్ అభ్యర్థన మేరకు కోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్ గురువారం మంజూరు చేసింది.
బెయిల్ కండీషన్ల ప్రకారం...దర్శకుడు బషీద్ ప్రతిరోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అదే విధంగా రూ. లక్ష పూచికత్తు, విచారణకు పూర్తిగా సహకరించాలి. ఎలాంటి పలుకుబడి ఉపయోగించి సాక్ష్యాలను తారుమారు చేయడం లాంటి పనులు చేయకూడదనే షరతులతో బెయిల్ మంజూరైంది.
రిషిక ప్రముఖ దర్శకుడు ఎస్.వి. రాజేంద్రసింగ్ కూతురు, కన్నడ సినీ ప్రముఖుడు ఆదిత్యకు సోదరి. ఇటీవల 'బెంకి బిరుగాలి' అనే కన్నడ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో రిషిక కూడా నటించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు అందులో ముఖ్య పాత్రలో నటించాడు ఎస్.కె. బషీద్. ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించడానికే ఆయన ఈ పని చేసాడని రిషిక ఆరోపించింది.

రిషిక అభ్యంతరం తెలిపిన ఒక నిమిషం నిడివిగల వీడియోలో దర్శకుడు బషీద్‌తో రిషిక రొమాన్స్ చేసినట్లు ఉంది. అందులో రిషిక న్యూడ్‌గా కనిపించినట్లు వీడియోను మార్పింగ్ చేసారు.

దర్శకుడు తనను బెదిరింపులకు కూడా గురి చేసాడని రిషిక తన ఫిర్యాదులో పేర్కొంది

గత సంవత్సరం రిషిక ఓ వివాదంలో ఇరుక్కుంది. బట్టలు వేసుకోకుండా శరీరం మొత్తాన్ని ఎండిపోయిన బురదతో కవర్ చేసుకున్న పోస్టర్లు వివాదానికి కారణం అయ్యాయి.

ఆ పోస్టర్‌కు వ్యతిరేకంగా పలు మహిళా సంఘాలు రిషికకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ప్రస్తుతం రిషిక సింగ్ కన్నడ వెర్షన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటూ బిజీగా గడుపుతోంది. ఈ షోలో ఆమె తన ముక్కుసూటి తనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











