రిస్కీ స్టంట్స్ కంటే డాన్సే కష్టం: అల్లు అర్జున్

By Sindhu

సినిమాల్లో ఫైట్లు చేయడం కంటే డాన్సులు చేయడమే ఎక్కువ కష్టమని అంటున్నారు హీరో అల్లు అర్జున్. 'బద్రినాథ్' సినిమాలో సమురాయ్ తరహా కత్తి ఫైట్లు చేయడం కోసం వియత్నాం వెళ్లి రెండు నెలల పాటు శిక్ష కూడా పొందిన అతను "చిరంజీవి మావయ్య డాన్స్ చేస్తుంటే అందరూ ఎంజాయ్ చేస్తారు. 'బద్రినాథ్'లో ఆయన్ని గుర్తుకు తేవాలని ఓ పాటలో కొన్ని బిట్స్ ఆయనలా చేశా. యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం కంటే డాన్స్ చేయడమే ఎక్కువ కష్టం. స్టంట్స్ ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి బాగా తీయొచ్చు. అందుకే ఇవాళ 'యాక్షన్ ఎంతా బాగా చేశాడు 'అనడం లేదు. ఎంత బాగా తీశారు అంటున్నారు. డాన్సుకి అలా కుదరదు ఫిజికల్ గా చెయ్యాల్సిందే అని అంటున్నారు అర్జున్.

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వినోదాత్మకంగా సాగే ఓ యాక్షన్ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య సమర్పణలో ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం మొన్నామద్యన హైదరాబాద్‌లో మొదలైన విషయం విధితమే. ఈ సినిమాలో బన్నీ సరసన ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. వరుడు, బద్రీనాథ్ రెండూ యాక్షన్ బేస్ అయిన మూవీస్ కాబట్టి ఈ సారి తనదైన స్టైల్ లో సరదాగా సాగిపోయే సినిమా చేయాలనుకుంటున్నాడట. ఫన్నీ గా సాగే కథతో సినిమా లాగించేయడం బాగా తెలిసిన త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని విశ్వసనీయ సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X