రితీష్-జెనీలియాల కొడుకు పేరు ఇదే!
హైదరాబాద్: జెనీలియా నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు. తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.

'తుజే మేరీ కసమ్'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. 2012లో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఈ యేడాది ఆరంభంలో జెనీలియా గర్భం దాల్చిన విషయాన్ని దంపతులిద్దరూ వెల్లడించారు. జెనీలియా బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయాన్ని తెలుసుకొన్న పలువురు సినీ తారలు జెన్నీ, రితేశ్ దంపతులకు అభినందనలు తెలిపారు.



Click it and Unblock the Notifications











