twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరాఠీ సాంప్రదాయంలో ఘనంగా జెనీలియా వివాహం

    By Bojja Kumar
    |

    genelia wedding
    బాలీవుడ్ స్టార్స్ జెనీలియా-రితేష్ దేశ్ ముఖ్ వివాహం శుక్రవారం ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరిగింది. మరాఠీ సంప్రదాయం ప్రకారం వివాహ మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు బాలీవుడ్ ప్రముఖులతో పాటు కేంద్ర స్థాయిలోని రాజకీయ నాయకులు హాజరయ్యారు. హాజరైన వారిలో శరద్ పవార్, పృథ్విరాజ్ చౌహాన్, ప్రపుల్ పటేల్, అభిషేక్ బచ్చన్, కాజోల్ మరియు అజయ్ దేవగన్ తదితరులు ఉన్నారు. రితేష్ దేశ్ ముఖ్ తండ్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ప్రస్తుత కేంద్ర మంత్రి. గతంలో ఆయన మహా రాష్ట్ర ముఖ్య మంత్రిగా కూడా పని చేశారు.

    జెనీలియా-రితేష్ తొలిసారిగా 2003లో తాము కలిసి నటించిన 'తుజె మేరీ కసమ్' చిత్రంలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. గత ఆరేళ్లుగా వీళ్లు ప్రేమాయణం సాగిస్తున్నా మీడియాకు చిక్కకుండా వ్యవహరించారు. అయితే కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ రితేష్ ఈ విషయాన్ని బయట పెట్టారు.

    English summary
    Bollywood actors Riteish Deshmukh and Genelia D'Souza tied the knot today in traditional Marathi style at a five-star hotel here in the presence of leading figures from Bollywood and the world of politics. Riteish, wearing a white sherwani and red 'feta' (turban), entered the hotel on a 'ghodi'. The 'baaraat' started from the grounds near Grand Hyatt and reached the hotel.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X