మీడియాకు చిక్కిన జెనీలియా అర్ధరాత్రి ప్రేమాయణం
జెనీలియాకు, రితీష్ దేశ్ ముఖ్ కీ మధ్య చాలా కాలంగా ఎడతెగని ప్రేమ కొనసాగుతోందనే సంగతి తెలిసిందే. అయితే అప్పుడప్పుడూ వారు అబ్బే..మా మధ్య ఉన్నది స్నేహమే అని విడివిడిగా స్టేట్ మెంట్స్ ఇస్తూంటారు. తాజాగా వీరిద్దరూ శనివారం అర్ధరాత్రి పన్నెండు దాటాక ఓ రెస్టారెంట్ లో కలిసి ఉండటం కళ్ళబడింది.దాంతో నేషనల్ మీడియా దీనిపై గట్టిగానే స్పందించింది. అంతేగాక వారిద్దరూ ముద్దూ మురిపాలతో చాలా సేపు ఎంజాయ్ చేసారని రాసుకొచ్చింది. అలాగే ఆ సమయంలో జెనీలియా ఓ పాట పాడి తన ప్రియుడని సంతోష పెట్టిందని,తమకు పాట పాడటం అర్దం అయింది కానీ పాట ఏంటనేది తెలియలేదని వారు రిపోర్ట్ చేసారు. సినిమాలు లేక ఖాళీగా ఉన్న ఈ ఇద్దరూ ఇలా బిజీ అవుతున్నారని వ్యాఖ్యానించింది. ఇక జెనిలీయాతో తొలి చిత్రం చేసిన రితీష్ అప్పటినుంచి ఆమెతో బంధాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇక జెనిలీయా ఆరెంజ్ చిత్రం అనంతరం ఏ సినిమానూ ఒప్పుకోలేదు. త్వరలో ఓ యంగ్ హీరో చిత్రంలో చేయటం కోసం టాక్స్ జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











