బోయ్ ప్రెండ్ తో కలిసి జెనీలియా 'డేట్ నైట్'
బోయ్ ప్రెండ్ రితీష్ దేశముఖ్ తో జెనీలియా విడిపోయిందని, రితీష్ తాజాగా జాక్విన్ ఫెర్నాడెస్ అనే ఆమెతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవేమీ నిజం కాదని తాజా సంఘటన రుజువు చేసింది. రీసెంట్గా సౌత్ ముంబై మల్టీఫ్లెక్స్ లో జెనీలియా, రితీష్ కలిసి సెకెండ్ షో కి డేట్ నైట్ అనే చిత్రానికి వచ్చారు. రొమాంటిక్ కామిడీగా ఉన్న ఆ చిత్రాన్ని చూసి వారు బాగా ఎంజాయి చేసారు. అయితే ఇంటర్వెల్ సమయానికి తమ ప్రక్కన ఓ జర్నలిస్టు జంట కూర్చోవటం చూసి జెనీలియా కంగారుగా ప్రక్కకు తప్పుకుంది. రితీష్ ఏమీ తెలియనట్లు సినిమా చూడటంలో నిమగ్నమయ్యారు. దాంతో ఈ జస్ట్ ప్రెండ్స్ మని చెప్పుకునే ఈ కపుల్ కధేమిటని బాలివుడ్ లో మరోసారి చర్చ మొదలయ్యింది. జెనీలియా ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ తేజ సరసన ఆరెంజ్ చిత్రంలో చేస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











