అబ్బా వద్దు..! (కాబోయే వాడిని కంట్రోల్ చేస్తున్న జెనీలియా)
హీరోయిన్ జెనలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటివారం(4 లేదా 5న)లో వీరి వివాహం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ స్టార్ జోడీ తమ పెళ్లిని చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం ఎంపిక చేసిన సన్నిహితులు, దగ్గరి బందువులు, స్నేహితులను మాత్రమే తమ వివాహ వేడుకకు పిలవాలని....మ్యారేజ్ వేడుకను ప్రైవేట్ ఈవెంట్ లా జరుపుకోవాలనుకుంటున్నట్లు వారి సన్నిహితుల ద్వారా అందిన సమాచారం.
అయితే మహారాష్ట్రలోని పవర్ ఫుల్ పొలిటికల్ కుటుంబాల్లో రితేష్ దేశ్ ముఖ్ కుటుంబం ఒకటి. వాళ్ల నాన్న ప్రస్తుతం కేంద్ర మంత్రి, మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన తమ హోదాకు తగిన విధంగా ఈ పెళ్లి వేడుకను జరుపాలని యోచిస్తున్నాడని మహా రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.
అయితే జెనీలియా మాత్రం అలాంటి ఆర్భాటాలు, హంగులు వద్దు...నిరాడంబరంగానే పెళ్లి వేడుక జరుపుకుందాం, అలా అయితేనే మన సినీ స్టార్ హోదాకు తగిన విధంగా బాగుంటుందని ఒత్తిడి తెస్తున్నట్లు బాలీవుడ్ గుసగుస. పెళ్లికి ముందే తనను కంట్రోల్ చేస్తున్న ప్రేయసి మాటను కాదనలేక, అటు కుటుంబలో తన పెళ్లి గురించి ఏర్పాట్లకు అడ్డు చెప్పే ధైర్యం చేయలేక సతమతం అవుతున్నాడట హీరో రితేష్...


Click it and Unblock the Notifications











