twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెనీలియా వర్సెస్ ఆమె భర్త! ఢీ అంటే ఢీ!

    By Bojja Kumar
    |

    ప్రేమ వివాహం చేసుకున్న హీరోయిన్ జెనీలియా, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ త్వరలో బాక్సీఫీసు వద్ద ఢీ అంటే ఢీ అంటూ తలపడబోతున్నారు. తాజాగా వీరిద్దరూ నటించిన రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. రితేష్ నటించిన 'క్యా కూల్ సూపర్ హై హమ్', జెనీలియా నటించిన 'ఇట్స్ మై లైఫ్' చిత్రాలు జూలై 27న ప్రేక్షకుల ముందుకురానున్నాయి.

    'ఇట్స్ మై లైఫ్' జెనీలియా కథానాయికగా నటించిన తెలుగు సూపర్‌హిట్ 'బొమ్మరిల్లు' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. హర్మన్ బవేజా కథానాయకుడు. తెలుగులో హాసిని పాత్రను పోషించిన జెనీలియా హిందీలో అదే పాత్రను చేస్తోంది. పెళ్లయిన తర్వాత ఈ జంట నటించిన రెండు చిత్రాలు పోటాపోటీగా విడుదలకాబోతుండటం విశేషం.

    పెళ్లికి ముందు నుంచి టాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్న జెన్నీ...చివరగా తెలుగులో రాణాతో కలిసి నా ఇష్టంచిత్రంలో నటించింది. ఆ చిత్రం ప్లాపయింది. ఇక జెనీలియా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అంజని పుత్ర ఇన్ ఫ్రా స్ట్రక్చర్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కస్టమర్లను రూ. కోట్లలో మోసం చేసిన విషయం తెలిసిందే.

    జనీలియా ఆ సంస్థలో డైరెక్టర్‌గా ఉండటంతో పాటు, ఆమె ప్రచారం చేయడం వల్లనే తాము ఆ సంస్థను నమ్మి ఫ్లాట్ల కోసం డబ్బులు చెల్లించామని, జెనీలియా తమను తప్పుతోవ పట్టించిందని, సంస్థ చేసిన మోసానికి పూర్తిగా జెనీలియా బాధ్యత వహించాలని బాధితులు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

    English summary
    Ritesh Deshmukh and his wife Genelia D’Souza who got married earlier this year are facing each other at the ticket window as their respective films are set to release on the same Friday. Ekta Kapoor’s ‘Kyaa Super Kool Hain Hum’ (2012) and Anees Bazmee directed ‘It’s My Life’ (2012) will battle it out. Speaking to Hindustan Times, Boney Kapoor co-producer of ‘It’s My Life’ said, “July 27 could be a possible release date for us, but it’s not confirmed yet. We might push it to August. When asked about the Riteish-Genelia collision, he says, “We will see how things go.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X