బాక్సింగ్ పిల్లతో సాయిధరమ్ తేజ్ రొమాన్స్!
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యూ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్ర చిత్రీకరణ ఇప్పటికే ముగిసింది. ఇటీవల ఆడియో వేడుక కూడా నిర్వహించారు. జులై 6 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.
కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం తరువాత తేజు కొత్త సినిమా చర్చలు మొదలైపోయినట్లు తెలుస్తోంది. త్వరలో తేజు కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటించబోతున్నాడు. నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ వంటి రొమాంటిక్ చిత్రాలతో కిషోర్ తిరుమల గుర్తింపు తెచ్చుకున్నారు.

కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా రితిక్ సింగ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. గురు చిత్రంలో బాక్సింగ్ పిల్లగా రితిక సింగ్ పాపులారిటీ సంపాదించింది. తన నటనతో రితిక అందరిని మంత్రముగ్దుల్ని చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











