మహేష్ బాబు చర్యకు హీరోయిన్ షాక్.. నిజమా అంటూ నోరెళ్లబెట్టింది!!
ఓ సినిమా బాగుందని తెలిసినా, టాక్ బాగా వచ్చినా సదరు చిత్రాలను మన తెలుగు హీరోలు ప్రశంసిస్తున్నారు. చిన్న చిత్రాలకు పెద్ద హీరోల ప్రశంసలు లభిస్తే వారికి కొండంత అండగా ఉంటుంది. ఈ మధ్య మన తెలుగు స్టార్ హీరోలు చిన్న సినిమాలను గుర్తించి, అందులో నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను అభినందిస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఓ తమిళం సినిమాపై ప్రశంసలు కురిపించాడు.
తమిళం చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది ఓ మై కడవులే. ఈ సినిమాపై మహేష్ బాబు ట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అందరి నోళ్లలో నానుతోంది. ప్రతీ ఒక్క సీన్‌ను ఎంజాయ్ చేశానని, అందరూ అద్భుతంగా నటించారని, డైరెక్టర్ ఎంతో గొప్పగా కథనాన్ని సమకూర్చాడని, హీరో అశోక్ సెల్వన్ ఎంతో నాచులర్‌గా నటించాడని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

మహేష్ లాంటి సూపర్ స్టార్ తమ చిత్రాన్ని గుర్తించడంతో హీరోయిన్ రితికా సింగ్ ఉబ్బితబ్బిబైపోయింది. ఈ మేరక మహేష్ బాబు ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ఓ మై గాడ్ అంటూ షాక్ అయింది. ఇది నిజమా అంటూ ప్రశ్నించింది. థ్యాంక్యూ సో మచ్ సర్.. మీ నుంచి ఇది వచ్చిందంటే ఎంతో గొప్ప సర్.. వాటే డే అంటూ గాల్లో తేలిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన అశోక్ సెల్వన్‌తో నిహారిక జంటగా నటించబోతోంది.


Click it and Unblock the Notifications











