షాకిస్తున్న బాక్సింగ్ పిల్ల.. సిక్స్ ప్యాక్ తరహాలో రితికా సింగ్ లుక్!
విక్టరీ వెంకటేష్ నటించితిన గురు చిత్రంతో రితిక సింగ్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. గురు చిత్రంలో రితిక నటన తెలుగు వారిని కట్టిపడేసింది. ఆమె చలాకీతనం, అద్భుతమైన నటనతో అందరిని మైమరపించింది. ఆ తరువాత కూడా కొన్ని చిత్రాల్లో రితిక నటించింది.
రితిక ఆ మధ్యన లారెన్స్ సరసన శివలింగ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రితిక కొన్ని దక్షణాది చిత్రాలలో నటిస్తోంది. విభిన్నమైన చిత్రాలకు రితిక పూర్తి స్థాయిలో న్యాయం చేయగల నటి.

తాజగా రితిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే షాక్ కి గురి కావలసిందే. రితిక ఈ మధ్యన జిమ్ లో ఎక్కువగా కసరత్తులు చేస్తోంది. దానికి సంబందించిన ఫోటోలని ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్ గా మారిపోయాయి. ఆ పిక్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. రితిక్ అద్భుతమైన ఫిట్ నెస్ లుక్ లో అదరగొడుతోంది. సిక్స్ ప్యాక్ తరహాలో ఉన్న ఆమె లుక్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Click it and Unblock the Notifications











