ఆరుబయట లిప్‌లాక్: ఈవిడగారి ముద్దులకి హద్దేలేదా? నెటిజన్ల షాక్
బెంగాలీ భామ రియాసేన్ ఇప్పుడు తన హానీమూన్‌ను ప్రాగ్వేలో ఎంజాయ్ చేస్తున్నది. ఇక అక్కడ ఆ కొత్త జంటకు హద్దులే లేవు. పెళ్లి అయి లైసెన్స్ వచ్చింది కాబట్టి రోడ్డు మీదే రొమాన్స్ చేస్తున్నారు.
Recommended Video

ఒకప్పటి నటి మున్‌మున్ సేన్ గుర్తుందా. ఆమె కుమార్తె రియాసేన్ చాలాకాలం బాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నించినప్పటికీ పాపం కలిసి రాలేదు ఏదో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు చాలా కాలం పాటు తెరకీ, వార్తలకూ దూరమైంది ఈ హీరోయిన్ .

కొన్నేళ్లుగా సహజీవనం
కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు ఫోటోగ్రాఫర్ శివమ్ తివారీని వివాహమాడింది రియాసేన్. నిజానికి వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల స్లువేనియా ట్రిప్ కి కూడా వెళ్లి నెలరోజులు గడిపి వచ్చారు. ఈ పెళ్లి కేవలం చట్టబద్ధత కోసం మాత్రమేనని కుటుంబ సభ్యులే తెలిపారు.

శివమ్ తివారీ
రీయా సేన్ చెల్లెలు రైమా సేన్ వీరి పెళ్లి ఫొటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రియాకు పెళ్లి విషయంలో మొదట్నుంచీ ఓ కచ్చితమైన అభిప్రాయం ఉంది. సినిమా పరిశ్రమకు చెందనివాడిని, నిర్ణయం తీసుకునే విషయంలో స్మార్ట్ గా ఉండేవాడ్ని, వ్యక్తిత్వం కలిగిన మంచి వ్యక్తినీ పెళ్లాడాలనేది ఆమె అభిమతం. దానికి తగ్గట్టే... శివమ్ తివారీని వివాహం ఆడింది రియాసేన్.

విషకన్య
వీరి పెళ్లి బెంగాళీ సంప్రదాయంతో కుటుంబ సభ్యలు మధ్య చక్కగా జరిగిందని రైమా... ట్విట్టర్ ద్వారా తెలిపింది. 1991లో ‘విషకన్య' చిత్రం ద్వారా తెరకు పరిచయమైన రియాసేన్... ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో పలు చిత్రాల్లో నటించింది. పెళ్లి సమయానికి ఆమె వయసు 36.

హద్దులే లేవు
ఈ బెంగాలీ భామ ఇప్పుడు తన హానీమూన్‌ను ప్రాగ్వేలో ఎంజాయ్ చేస్తున్నది. ఇక అక్కడ ఆ కొత్త జంటకు హద్దులే లేవు. పెళ్లి అయి లైసెన్స్ వచ్చింది కాబట్టి రోడ్డు మీదే రొమాన్స్ చేస్తున్నారు. భర్త శివమ్ తివారితో దిగిన ఓ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

నెట్‌జెన్లు ఫిదా అవుతున్నారు
ఆ లిప్‌లాక్ ఫోటోకు ఇప్పుడు నెట్‌జెన్లు ఫిదా అవుతున్నారు. 1999లో తాజ్‌మహల్ అనే తమిళ ఫిల్మ్‌లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో జంకార్ బీట్స్, దిల్ విల్ ప్యార్ వ్యార్, దిల్ నే జిస్నే అప్పా కహా, షాదీ నెంబర్ వన్ చిత్రాల్లో నటించింది. గాఢ ముద్దులో తేలిన రియా ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











