హీరోయిన్ ముద్దు దుమారం, స్వలింగ సంపర్కురాలా?(ఫోటో)
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ రియా సేన్ మరోసారి వార్తల్లోకెక్కింది. రియా సేన్ ఇటీవల ముంబైలోని ఓ నైట్ పార్టీలో మరో యువతిని లిప్ టు లిప్ ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశం అయింది. అయితే రియా సేన్ ముద్దు పెట్టుకున్నది ఎవరిని? అనేది మాత్రం తెలియడం లేదు.
ఈ విడ మరో ఆవిడను ముద్దు పెట్టుకున్న సంఘటనపై పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఆమె స్వలింగ సంపర్కురాలా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా నిజా నిజాలు తెలియాల్సి ఉంది. ఈ ఫోటోపై రియా సేన్ ఇప్పటి వరకు స్పందించలేదు.
రియాసేన్ గతంలో కూడా ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కుంది. తన సహనటుడు అస్మిత్ పటేల్ తో రియాసేన్ రొమాన్స్ చేస్తున్న ఎంఎంఎస్ వీడియో అప్పట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. అటు వెండి తెరపై కూడా హాట్ హాట్ సీన్లు చేయడానికి ఏమాత్రం మొహమాట పడని నైజం ఆమెది.
అయితే... ఎంత చేసినా రియా సేన్‌కు కెరీర్ పరంగా సరైన బ్రేక్ రావడం లేదు. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ చిత్రం కూడా భారీ విజయం సాధించ లేదు. దీంతో చిన్నచితకా సినిమాల్లోనే నటిస్తోంది. స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగడానికి ఎప్పటికప్పుడు సరికొత్త కాంట్రవర్సీలతో రియా సేన్ వార్తల్లో నిలుస్తున్నా... ఫలితం మాత్రం కనిపించడం లేదు. రియాస్ తెలుగులో నటించిన ఒకే ఒక్క సినిమా 'నేను మీకు తెలుసా?'. ఈచిత్రంలో రియా సేన్ మంచు మనోజ్ ప్రియురాలిగా నటించింది.


Click it and Unblock the Notifications












