twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అంతా బూతే.. ఈ సినిమా చేస్తున్నట్లు మా ఇంట్లో తెలిస్తే తంతారు’

    |

    తెలుగు సినిమా పరిశ్రమలో అడల్ట్ సినిమాల జోరు క్రమక్రమంగా పెరుగుతోంది. శృంగార ప్రధానమైన చిత్రాలకు మంచి మార్కెట్ ఉండటంతో ఆ దిశగా కొందరు ఫిల్మ్ మేకర్స్ అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆ కోవలో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    ఫ్యామిలీతో కలిసి చూడలేని, పెద్లలకు మాత్రమే పరిమితమైన ఈ చిత్రానికి పి. సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. '24 కిస్సెస్' మూవీ ఫేం అదిత్ హీరోగా నటిస్తుండగా, నిక్కి తంబోలి హీరోయిన్. ఆర్.జె హేమంత్, పోసాని కృష్ణ మురళి, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ట్రైలర్ విడుదలవ్వగా దాదాపు 3 మిలియన్‌పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

    ముందే మెంటల్‌గా బాగా ప్రిపేర్ అయ్యాం

    ముందే మెంటల్‌గా బాగా ప్రిపేర్ అయ్యాం

    ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించిన ఆర్.జె.హేమంత్ మాట్లాడుతూ... ‘చీకటి గదిలో చితక్కొట్టుడు'లో ఫుల్ లెంగ్త్ రోల్‌లో తొలిసారి కనిపించబోతున్నారు. ఈ అడల్ట్ జోనర్ సినిమా ఎంచుకునే ముందే మెంటల్‌గా బాగా ప్రిపేర్ అయ్యాం. ఇపుడు మసులుతున్న వేడి నీళ్లలో దూకినట్లు ఉంది.' అన్నారు.

    రకరకాల కామెంట్స్ వస్తున్నాయి

    రకరకాల కామెంట్స్ వస్తున్నాయి

    ట్విట్టర్ ఓపెన్ చేస్తే బోలెడన్ని రీట్వీట్లు, మెసేజెస్ వస్తున్నాయి. కొందరేమో ఇలాంటి సినిమా చేస్తున్నారేంటి అంటున్నారు. ఒక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తూ బయ్యా నా ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి. ఈలోగా రిలీజ్ చేయండి ప్లీప్ సినిమా చూడాలనుకుంటున్నానని కోరాడు. ఇంకొకరేమో మార్చిలో రిలీజ్ చేస్తే కంబైండ్స్ స్టడీస్ అని చెప్పి సినిమాకు వెళతామని చెబుతున్నారని తెలిపారు.

    మా అమ్మ ఫోన్లో యూట్యూబ్ తీసేశా, తెలిస్తే తంతారు

    ‘ఇలాంటి సినిమాలు చేస్తున్నామంటే ఎవరి ఇంట్లో అయినా అభ్యంతరాలు ఉంటాయి. అందుకే మా అమ్మ ఫోన్ నుంచి యూట్యూబ్ యాప్ తీసేశాను. ఇప్పటి వరకైతే వారికి తెలియకుండా మెనేజ్ చేస్తున్నాను. వారు ఇంకా ట్రైలర్ చూడలేదు. ఇలాంటివి చూసి ఎవరి ఇంట్లో అప్రిషియేట్ చేయరు...తంతారు' అని హేమంత్ చెప్పుకొచ్చారు.

    ఫ్యామిలీతో రావొద్దని దర్శకుడు ఆల్రెడీ చెప్పాడు

    ఫ్యామిలీతో రావొద్దని దర్శకుడు ఆల్రెడీ చెప్పాడు

    మా డైరెక్టర్ ట్రైలర్ లాంచ్ రోజు ఓ మాట చెప్పాడు. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూద్దామనుకుంటే సపరేట్ సపరేట్‌గా రండి అని ముందే చెప్పారు. మన ఇళ్లలో ఫ్యామిలీతో కలిసి కిస్సింగ్ సీన్స్ కూడా చూడటానికి కూడా ఇష్టపడం. ఈ సినిమా అయితే ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేం. ఫ్రెండ్స్‌తో కలిసి వస్తే బాగా ఎంజాయ్ చేయవచ్చని తెలిపారు.

    English summary
    RJ Hemanth about Chikati Gadilo Chithakotudu movie. Chikati Gadilo Chithakotudu movie ft. Adith and Nikki Tamboli. Directed by Santhosh P Jayakumar and Music by Balamurali Balu. Produced by Blue Ghost Pictures.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X