అమిత్ షా పుట్టిన రోజున విలన్ రామిరెడ్డి ఫొటోతో విషెస్.. ఒక రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న (అక్టోబర్ 22) తన 57వ పుట్టినరోజు జరుపుకున్నారు. అమిత్ షాకు బిజెపితో సహా దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీహార్ రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే సురేందర్ ప్రసాద్ యాదవ్ రెండు విభిన్న ఫోటోలను పోస్ట్ చేసి, అమిత్ షా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఫోటోలలో ఒకటి టాలీవుడ్ విలన్ రామిరెడ్డి కాగా మరొకరు తమిళ విలన్ సంతాన భారతి. ఆ వివరాల్లోకి వెళితే

అమిత్ షా 57వ పుట్టినరోజు

అమిత్ షా 57వ పుట్టినరోజు


హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా 57వ పుట్టినరోజు అక్టోబర్ 22న జరుపుకున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల బీజేపీ నేతలు ఆయన పుట్టినరోజు జరుపుకున్నారు. అలాగే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మొదలు ఏపీ తెలంగాణ నేతలు చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ అభినందనలు తెలిపారు. కేంద్ర మంత్రి అమిత్ షాను రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత సురేందర్ ప్రసాద్ యాదవ్ కూడా తన అభినందనలు తెలిపారు.

రామిరెడ్డి ఫోటోను పోస్ట్

అమిత్ షాకు రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే సురేందర్ ప్రసాద్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే తన ట్విట్టర్ పోస్ట్‌లో, మన హోం మంత్రి అమిత్ షా జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, తెలుగులో ఫేమస్ విలన్ అయినా రామిరెడ్డి ఫోటోను పోస్ట్ చేశారు.

ఆశ్చర్యం

ఇది చూసిన వారికి షాక్‌తో పాటు ఆశ్చర్యం కలిగించింది. అసలు సురేందర్ ప్రసాద్ యాదవ్ తెలిసి ఈ పోస్ట్ చేశాడా? లేక పొరపాటున ఈ పోస్ట్ చేశాడా? అని నెటిజన్లు ఉలిక్కిపడ్డారు. ఇది చూసిన వారంతా దేవత చిత్రంలో నటించిన వ్యక్తి ముఖం లాగా ఉందని కామెంట్లు చేశారు. దానికి ఆయన బదులిస్తూ, 'నేను దీన్ని రీల్ మరియు రియల్ క్యారెక్టర్ ఆధారంగా పోస్ట్ చేశాను కానీ నేను ఇమేజ్‌తో దీన్ని చేయలేదని చెప్పుకొచ్చారు.

సంతాన భారతి ఫోటో షేర్ చేసి

ఈ విషయం మీద ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో మరోమారు తమిళ సినిమా విలన్, నటుడు సంతాన భారతి ఫోటో షేర్ చేసి అమిత్ షాకు ఎమ్మెల్యే మళ్లీ అభినందనలు తెలిపారు. రెండో సరి పోస్ట్ చేసినప్పుడు క్షమించండి. ఉత్కంఠగా సాగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో నేనే తప్పు చేశాను. మా అద్భుతమైన మోటా అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అని ట్వీట్ చేసారు.

ఆర్జేడీ ఎమ్మెల్యే జోకులు

ఇక ఇప్పటికే అమిత్ షా పై మండిపడుతున్న నెటిజన్లకు ఎమ్మెల్యే రెండో పోస్ట్ మరింత జోకులు వేసుకునేందుకు అవకాశం వచ్చింది. బీహార్‌లో అక్టోబర్ 30 న తారాపూర్ మరియు కుశేశ్వర్ ఆస్థాన్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, రాష్ట్రీయ జనతాదళ్ సహా ఇతర పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆర్జేడీ ఎమ్మెల్యే సురేందర్ ప్రసాద్ యాదవ్ బర్త్ డే విషెస్ పోస్ట్ చేస్తూ అమిత్ షాను ఆట పట్టించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X