twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమిళ షూటింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు?? రోడ్డున పడతారు అంటూ వివాదం రేపిన రోజా భర్త..

    |

    ప్రస్తుతం సినిమా పరిశ్రమలో భాషా భేదం పెద్ద ఎత్తున హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. అసలు హిందీ తప్ప మిగతా భాషలలో తాను నటించేది లేదు అంటూ జాన్ అబ్రహం మొదలు పెట్టిన ఈ వివాదం అనేక మంది చేత అనేక మాటలు అనిపిస్తుంది. కొంత ఈ విషయం మరుగున పడుతుంది అనుకుంటున్న సమయంలో తమిళ సినిమా షూటింగులు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు చేస్తున్నారు అంటూ మరో వివాదం సృష్టించారు మంత్రి రోజా భర్త సెల్వమణి. ఆ వివరాల్లోకి వెళితే

    తెలుగు రాష్ట్రాలలోనే

    తెలుగు రాష్ట్రాలలోనే


    సినీ షూటింగ్ కోసం హైదరాబాద్ లో అనేక సౌకర్యాలు ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ మొదలు అన్నపూర్ణ స్టూడియో, అల్యూమినియం ఫ్యాక్టరీ లాంటి అనేక చోట్ల సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన షూటింగులు మాత్రమే కాక బాలీవుడ్ షూటింగ్ లు కూడా జరుగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇటీవల తమిళ సినిమాలు చాలా వరకు తెలుగు రాష్ట్రాలలోనే షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.

    గతంలో

    గతంలో

    తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర పర్మిషన్ తొందరగా ఇవ్వడం, మ్యాన్ పవర్ ఎక్కువగా ఉండడం, ఖర్చులు తక్కువగా ఉండటం, మంచి లొకేషన్లు వెతక కుండానే దొరకడంతో హైదరాబాద్, వైజాగ్, సహా అనేక ప్రాంతాల్లో సినిమాని బట్టి,. లొకేషన్ ని ఎంచుకొని షూటింగ్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా తమిళ స్టార్ హీరోల సినిమాలన్నీ హైదరాబాద్ లోనే షూటింగ్స్ జరుపుకున్నాయి. రజినీకాంత్, విజయ్, అజిత్ సినిమాలు హైదరాబాద్ లో షూట్ జరిగాయి.

    ఇప్పుడు కూడా

    ఇప్పుడు కూడా

    ప్రస్తుతం ధనుష్, శివ కార్తికేయన్, విజయ్, అజిత్ సినిమాల షూటింగ్ లు కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అయితే ఈ విషయంపై నటి రోజా భర్త, ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) అధ్యక్షుడు సెల్వమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్వమణి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. "రజినీకాంత్, విజయ్, అజిత్ సినిమాల షూటింగ్స్ హైదరాబాద్, వైజాగ్ లో ఎందుకు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.

    రోడ్డు మీద పడతారు అని

    రోడ్డు మీద పడతారు అని

    తమిళ హీరోలకు సంబంధించిన సినిమా షూటింగ్స్ చెన్నైలో ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. తమిళ చిత్ర పరిశ్రమను నమ్ముకొని వేలాది మంది కార్మికులు ఉన్నారని గుర్తు చేసిన ఆయన వారందరికీ కనుక ప‌ని క‌ల్పించ‌క‌పోతే పరిశ్ర‌మ‌నే న‌మ్ముకున్న వారు రోడ్డు మీద పడతారు అని హెచ్చరించారు.

    అల్టిమేటం

    అల్టిమేటం

    ఇక తమిళనాడులో షూటింగ్స్ చేయ‌డానికి ప‌నికి రామా? ప్ర‌తి చిన్న దానికి హైద‌రాబాద్‌, వైజాగ్ అంటూ వెళ్తే మిమ్మ‌ల్ని న‌మ్ముకున్న తమిళ కార్మికుల భ‌విష్య‌త్తు ఏమవ్వాలి" అని సెల్వమణి ప్రశ్నించారు. అంతే కాక ఇకపై త‌మిళ చిత్రాల షూటింగ్స్‌ను త‌మిళ‌నాడులోనే జ‌ర‌గాలంటూ త‌మిళ నిర్మాత‌ల‌కు త‌మిళ సినీ కార్మిక సంఘం అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.

    అజిత్ మీద ఫైర్

    అజిత్ మీద ఫైర్


    దీనికి సంబంధించి తమిళ నిర్మాతలు, హీరోలతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఇదే విషయం మీద హీరో విజయ్ ను సంప్రదించగా ఆయన తమిళనాడులోనే షూటింగ్ జరపడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని కానీ అజిత్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం కావడంతో ఆయన ఇంకా ఎలాంటి స్పందన తెలియ చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ మీద సెల్వమణి ఫైర్ అయ్యారు. ఇప్పుడైనా షూటింగ్ ఎక్కడ నిలిపివేసి చెన్నైలో చేయాలని సెల్వమణి కోరారు

    English summary
    RK Selvamani demands tamil stars to shoot films in Tamil Nadu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X