For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రాయ్ లక్ష్మీ, అంజలి లేడీ మల్టీస్టారర్.. సిల్వర్ స్క్రీన్‌పై హాట్ హాట్‌గా..

  By Rajababu
  |
  హాట్ భామలతో లేడీ మల్టీస్టారర్..!

  వెండితెరపై హాట్ హాట్ హీరోయిన్లు అంజలి గానీ, లేదా రాయ్ లక్ష్మీ సినిమాలంటే యూత్‌లో చెప్పలేనంత క్రేజ్. సోలోగా అంజలి సినిమా వచ్చినా గానీ, రాయ్ లక్ష్మీ మూవీ వచ్చినా గానీ భలే క్రేజ్ ఉంటుంది. అలాంటిది ఇద్దరు హీరోయిన్లు కలిసి నటిస్తే సిల్వర్ స్క్రీన్ మీద రచ్చ రచ్చే. వీరిద్దరి కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారనే వార్త టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

   జూలీ2లో రాయ్ లక్ష్మీ

  జూలీ2లో రాయ్ లక్ష్మీ

  రాయ్ లక్ష్మీ తాజా చిత్రం జూలీ2. ఈ చిత్రం ద్వారా ఆమె బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అయితే జూలీ2 చిత్రానికి పెద్దగా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ రాలేదు. అయితే రాయ్ లక్ష్మీ గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి.

   బెలూన్‌ సినిమాలో

  బెలూన్‌ సినిమాలో

  ఇక అంజలి మధ గజరాజ, బెలూన్, కాలి చిత్రాల్లో నటిస్తున్నది. ఆమె నటించిన బెలూన్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇటీవల విడుదలైన బెలూన్ ఫస్ట్‌లుక్ మంచి స్పందన వచ్చింది.

   అంజలి, రాయ్ ఒకే స్క్రీన్‌పై

  అంజలి, రాయ్ ఒకే స్క్రీన్‌పై

  ఇలా వెండితెరపైన హాట్ హాట్‌గా నటిస్తున్న అంజలి, రాయ్ లక్ష్మీని ఆర్కే స్టూడియో బ్యానర్ కలిపింది. గుంటూరు టాకీస్, రాజా మీరు కేక లాంటి వినోదాత్మ‌క చిత్రాల‌ను ఆర్కే స్టూడియో బ్యానర్ నిర్మించింది. ప్రస్తుతం ప‌వ‌నిజం-2 చిత్రం , షూటింగ్ ద‌శ‌లో ఉన్నది.

  ఆర్‌కే స్టూడియో బ్యానర్‌పై

  ఆర్‌కే స్టూడియో బ్యానర్‌పై

  ఆర్‌కె స్టూడియోస్ బ్యానర్ పై ఎమ్. రాజ్‌కుమార్ గారు నిర్మాత‌గా, నంది అవార్డు గ్ర‌హీత క‌ర్రి బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. . గీతాంజ‌లి, చిత్రాంగ‌ద వంటి చిత్రాల‌తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న అంజ‌లి, కాంచ‌న సినిమాతో మాంచి ఫేమ్ సంపాదించిన రాయ్ ల‌క్ష్మి ముఖ్య పాత్ర‌ల్లో త్వ‌ర‌లోనే ఒక స‌రికొత్త‌ చిత్రం ప్రారంభం కానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది.

   య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా

  య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా

  కొన్ని య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా, వినూత్న‌మైన సోష‌ల్ ఎలిమెంట్స్ తో కూడిన క‌థ‌తో, వినోదం మరియు ఉత్కంఠ‌భ‌రిత‌మైన క‌థ‌నంతో ఈ చిత్రం ఉండ‌బోతుంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలియజేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

   నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  అంజ‌లి, రాయ్ ల‌క్ష్మి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రంలో సాయి కుమార్, న‌రేష్, శివ‌ప్ర‌సాద్, ధ‌న్‌రాజ్, జాకీ, అశోక్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి, సంగీతంః మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీః పి.జి విందా, ఎడిటింగ్ః త‌మ్మిరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ద‌త్తి సురేష్ కుమార్, ప్రొడ్యూస‌ర్ః ఎమ్. రాజ్‌కుమార్, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః క‌ర్రి బాలాజీ అందిస్తున్నారు.

  English summary
  After the Superhit of “GunturTalkes”.. Producer M.Rajkumar produced few Entertainers like “Raja Meeru Keka” and “Pawanism 2”.. He is Now Making a different thriller with Popular heroines Anjali and Raai Lakshmi.. This film will be helmed by Nandi award winner Karri Balaji. The movie story based on true events and will have suspense elements and gripping screenplay says makers.Currently Pre-Production work of the film is underway and starts soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more