"భావి ముఖ్యమంత్రి బాలయ్య అనలేదు"!
భావి ముఖ్యమంత్రి బాలయ్యే అన్నది అభిమానులు కానీ తానుకాదని విప్లవ చిత్రాల దర్శక కథానాయకుడు ఆర్.నారాయణమూర్తి స్పష్టం చేశాడు. గత శుక్రవారంనాడు సైబర్ గార్డెన్స్ లో జరిగిన ఒక్క మగాడు ఆడియో విడుదల సందర్భంగా దాసరి, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపిన సంగతి తెలిసిందే. అయితే భావి ముఖ్యమంత్రి బాలయ్యే అని అభిమానులు నినాదాలు చేయగా పాండురంగడు, శ్రీకృష్ణుడు తదితర పాత్రలు చేసిన తరువాతే రాజకీయాలలోకి వస్తారు బ్రదర్ అని మాత్రమే అన్నానని నారాయణమూర్తి స్పష్టం చేశారు. మొదటిది అభిమానులు ఆనగా దానికి స్పందనగా ఇంకా కొద్ది రోజులు ఆగాలనే అర్థంలో అన్నానే తప్ప తానే ఆ మాటలు అనలేదని నారాయణమూర్తి వివరణ ఇచ్చుకున్నారు.


Click it and Unblock the Notifications











