వరంగలా యాసిడ్ దాడిని పురస్కరించుకుని తెలుగు దేశం మహిళ అధ్యతక్ష్యరాలు రోజా ..రామ్ చరణ్ పై కామెంట్ చేయటం అంతటా చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో చరణ్ ..హీరోయిన్ వెనకపడి ప్రేమించమని వేధిస్తాడని ఓ ఇంటర్వూలో చెప్పింది. అయితే పరిశ్రమలో ఓ వర్గం వారు ..ఆ సినిమాలో చరణ్ ఎక్కడా హీరోయిన్ ని వేధించడని..ఆమె కావాలనే ఇలా ఆరోపిస్తోందని అంటున్నారు.కాదు..కాదు సెకెంఢాఫ్ లో ఇద్దరూ ఒంటరిగా సముద్రం ఒడ్డున మిగిలినప్పుడు(కహోనా ప్యార్ హై సీన్స్) చరణ్ ఆమెని ఏడిపిస్తాడు. అయినా రోజా కామెంట్ దేశముదురు పై చేసి ఉన్నా అర్ధం ఉండేదని ఉప్పు అందిస్తున్నారు. దేశముదురు లో అల్లు అర్జున్ ...యోగిని గా ఉన్న హన్సిక వెంట పడి ప్రేమించమని అడగటాన్ని చెప్తున్నారు. ఇక రాజకీయంగా ఎవరికి ఎంత వరకూ ఈ కామెంట్స్ ఉపయోగపడతాయో గానీ ఇదంతా టీవీల్లో ప్రేక్షకులకు మంచి ఎంటర్ టైన్ మెంట్ లా కనిపిస్తోంది.
Story first published: Monday, December 15, 2008, 11:30 [IST]