చిరంజీవి ఇంట్లో చోరీ చేసిన డబ్బుతో ఏం చేశాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన చోరీకి సంబంధించిన కేసు మిస్టరీ వీడింది.
Recommended Video

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరుగడం ఫిల్మ్ నగర్లో సంచలనం అయింది. దాదాపు పదేళ్లుగా నమ్మకంగా పని చేస్తున్న ఓ సర్వెంట్ ఇంట్లో లక్షలు దోచుకెళ్లాడనే విషయం తెలిసి అంతా నివ్వెర పోయారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా రూ. 16 లక్షల రూపాయలు ఇంట్లో పని చేసే చిన్నయ్య అనే వ్యక్తి దొంగిలించినట్లు పోలీసు విచారణలో తేలింది.
చిరంజీవి ఇంటికి భారీ భద్రత, సీనీ కెమెరాల నిఘా ఉంటుంది. బయటి వ్యక్తులు ఎవరైనా లోనికి వస్తే ఇట్టే తెలిసి పోతుంది. అయితే తరచూ ఇంట్లో డబ్బు మాయం అవుతుండటంతో ఇంట్లో పని చేసే వారే ఈ పని చేస్తున్నారని గ్రహించారు. నిఘా పెట్టగా చిన్నయ్య అనే సర్వెంట్ డబ్బు దొంగిలిస్తూ దొరికిపోయాడు.

16 లక్షలు దొంగిలించినట్లు ఒప్పుకున్న చిన్నయ్య
పోలీసు విచారణలో చిన్నయ్య రూ. 16 లక్షలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ మొత్తాన్ని గడిచిన కొన్ని నెలలుగా దఫదఫాలుగా చోరీ చేసినట్లు అంగీకరించాడు.

నమ్మకంగా పని చేసి...
చిన్నయ్య చిరంజీవి ఇంట్లో గత పదేళ్లుగా పని చేస్తున్నారు. నమ్మకమైన పని వాడిగా ఇంట్లో స్వేచ్ఛగా తిరిగే చిన్నయ్య ఇంట్లో ఎక్కడ డబ్బు దాస్తారనే విషయాలు తెలుసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో, ఎవరి కంట పడకుండా డబ్బు దొంగిలించడం మొదలు పెట్టాడు.

రోజూ ఎంతో కొంత నొక్కేసేవాడు
చిన్నయ్య ప్రతి రోజూ ఎంతో కొంత డబ్బు నొక్కేసేవాడు. అయితే ఇటీవల భారీ మొత్తంలో రూ. 2 లక్షలు దొంగిలించడంతో దొరికిపోయాడు. అయితే చిన్నయ్య నుండి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు విచారిస్తున్నారు.

ఆ డబ్బుతో ప్లాట్లు కొన్న చిన్నయ్య
చిరంజీవి ఇంట్లో దఫదఫాలుగా నొక్కేసిన డబ్బుతో చిన్నయ్య హైదరాబాద్ శివార్లలో రెండు ప్లాట్లు కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications