»   » రాజమౌళి-శంకర్ అలా చేస్తే వందల కోట్ల నష్టమే: క్లారిటీ ఇచ్చిన రానా!

రాజమౌళి-శంకర్ అలా చేస్తే వందల కోట్ల నష్టమే: క్లారిటీ ఇచ్చిన రానా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో గతేడాది రిలీజైన 'బాహుబలి-ది బిగినింగ్' ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ. 650 కోట్ల బిజినెస్ చేసింది. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిలోనూ బాహుబలి సినిమా చూడాలనే ఆసక్తి రేకెత్తించింది.

ప్రస్తుతం రాజమౌళి చిత్రం యొక్క రెండో భాగం 'బాహుబలి-ది కంక్లూజన్' మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 14, 2017లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తొలి భాగం భారీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాల భారీగా ఉన్నాయి. రెండో భాగం రూ. 1000 కోట్ల బిజినెస్ మార్కను అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.


సౌత్ లో బాహుబలి-2తో పాటు భారీగా తెరకెక్కుతున్న మరో చిత్రం భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో-2.0'. రజనీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్లతో తెరక్కెతున్న ఈ చిత్రం కూడా 200 కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తెరకెక్కుతోంది.


అయితే ఇటీవలో ఓ రూమర్ ప్రచారంలోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయనేది ఆ వార్తల సారాంశం. ఒక వేళ అలా జరిగితే భారీ నష్టం తప్పదని, నష్టం వందల కోట్లలో ఉంటుందని పరిశ్రమ వర్గాలు అందోళన చెందుతున్నాయి.


అయితే ఈ విషయమై బాహుబలి స్టార్ రానా క్లారిటీ ఇచ్చారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన వివరాలు...


రానా మాట్లాడుతూ...

రానా మాట్లాడుతూ...

నేను కూడా ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయనే వార్తలు విన్నాను. అలా జరిగే అవకాశం అస్సలు లేదు, ఇది కేవలం రూమర్ మాత్రమే అని రానా స్పష్టం చేసారు.


ఇంకా చాలా వర్కు పెండిగులో ఉంది..

ఇంకా చాలా వర్కు పెండిగులో ఉంది..

బాహుబలి-2, రోబో 2.0 రెండు కూడా పెద్ద సినిమాలు. ఈ రెండు సినిమాల షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ తర్వాత విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందుకు చాలా సమయం అవసరం ఉంటుంది అన్నారు.


అవకాశమేలేదు..

అవకాశమేలేదు..

నాకు తెలిసినంత వరకు రోబో 2.0 ఏప్రిల్ లో రిలీజ్ అయ్యే అవకాశమే లేదు అని రానా స్పష్టం చేసారు.


బాహుబలి-2పై క్లారిటీ...

బాహుబలి-2పై క్లారిటీ...

బాహుబలి-2 సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 14, 2017లొ రిలీజ్ అవుతుందని రానా స్పష్టం చేసారు.


English summary
Rana Said that, “Two big films like Robot 2 and Baahubali 2 can never release on the same day. Also, they are yet to finish shooting and have a lot of work left. Then there is post production and VFX, which takes up the maximum time for such films. So Robot 2 isn’t releasing in April, but we are definitely releasing our film on April 14 next year.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu