'రోబో' కాపీ దుమారంపై హీరో ఉపేంద్ర స్పందన
రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం "రోబో"...2002 నాటి కన్నడ సైన్స్ ఫిక్షన్ "హాలీవుడ్" (చిత్రం టైటిల్) కు ప్రీమేక్ అన్నదానిని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కొట్టిపారేసారు. ఉపేంద్ర..హీలీవుడ్ చిత్రంలో హీరోగా చేసారు. ఆయన రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ...ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్...ఎలా నా చిత్రాన్ని, రోబోతో పోలుస్తున్నారో అర్దం కావటం లేదు. అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే..నేను హాలీవుడ్ చిత్రం ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ స్క్రిప్టు డిస్కషన్ నిమిత్తం శంకర్ ని కలిసాను. అంది కూడా ఎందుకంటే...ఆయన అప్పటికే తాను రోబో అనే చిత్రం చేస్తానని చెప్తూండేవారు.
ఇద్దరి కాన్సెప్టులూ ఒకటే అయితే సమస్య వస్తుందని, ఐడియాలు క్లాష్ కాకూడదనే ఉద్దేశ్యంతో ఆ పని చేసాను. అయితే శంకర్ నా కథకూ,ఆ స్క్రిప్టుకూ ఎక్కడా సంభందం లేదని, చక్కగా నా సినిమా తీసుకోమని,అలాగే తాను రోబోపై సినిమా చేయటానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. ఇదంతా జరిగి పదేళ్ళు అవుతోంది. అయినా శంకర్ జీనియస్...ఆయన ఎవరి కాన్సెప్టులూ కాపీ కొట్టాల్సిన పనిలేదు. ఇక నేను శంకర్ కీ, రజనీకాంత్ కీ వీర ప్యాన్ ని. అధ్బుతమైన స్టోరీ లైన్ తో ఎక్సలెంట్ స్క్రిప్టు చేసి ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్నారు అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











