Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలయ్యకు దక్కకుండా అడ్డుపడింది సూపర్ స్టారే....
2010 సంవత్సరంలో విడుదలైన స్ట్రయిట్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళ కురిపించిన చిత్రంగా 'సింహా" నిలించిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి. కానీ ఈ సినిమాకంటే అత్యధిక వసూళ్ళు కురిపించిన చిత్రంగా రజనీకాంత్ 'రోబో" చిత్రం నిలిచింది. దాంతో ఈ యేడాది ఫస్ట్ ప్లేస్ రజనీకే దక్కింది. ఒకవేళ 'రోబో" ఈ యేడాది లేకపోయుంటే బాలయ్యకు ఫస్ట్ ప్లేస్ దక్కేదని, 'పోకిరి రికార్డ్స్ ను సైతం 'సింహా" క్రాస్ చేసిందని పరిశీలకులు అంటున్నారు.
రజనీకాంత్ అడ్డుగా నిలవడం వల్లే బాలయ్య రెండో స్థానానికే పరిమితమవ్వాల్సి వచ్చిందని, లేకపోతే మొదటి స్థానం బాలయ్యదే అయ్యుండేదని మాట్లాడుకుంటున్నారు. కానీ స్ట్రయిట్ సినిమాల్లో అత్యధిక వసూళ్ళు కురిపించినసినిమాగా 'సింహా" నిలిచింది కాబట్టి ఈ యేడాది మొదటి స్థానం బాలయ్యదేనని, 'రోబో" బడ్జెట్ ఎక్కువ, డబ్బింగ్ చిత్రం కావడంతో ఈ సినిమాకి మొదటి స్థానం కల్పించలేమని కూడా కొంతమంది వాదిస్తున్నారు.