గ్రేట్...అమెరికాలో రిలీజుకు ముందే 'రోబో' రికార్డు!!
రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో రూపొందిన రోబో చిత్రం తమిళ వెర్షన్ అమ్మకాలలో అప్పుడే రికార్డు సృష్టించింది. అదీ కూడా అమెరికాలో కావటం మరో విశేషం. అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా న్యూయార్క్‌లోని జాక్సన్ హైట్స్ సినిమాస్ థియేటర్‌లో రికార్డు సృష్టించింది. రెండు వారాల ముందుగా అమ్మకాలు ప్రారంబించినా ఈ రీతిలో అమ్ముడుపోవటం అక్కడ ధియోటర్ యజమానులను షాక్ కి గురి చేసింది. టిక్కట్లు అమ్మకం మొదలైన పది నిమిషాల్లోనే వారం రోజుల టికెట్లు అమ్ముడయ్యాయి. సాధారణంగా అమెరికాలో ఏ సినిమా విడుదలైనా వారం ముందు మాత్రమే బుకింగ్ ప్రారంభమవుతుంది.
'ఎందిరన్'కు మాత్రం అభిమానుల నుంచి వస్తోన్న స్పందన దృష్ట్యా రెండు వారాల ముందే టికెట్ల విక్రయం ప్రారంభించారు. కెనడా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో కూడా 'ఎందిరన్'ను విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన ఐశ్వర్యారాయ్ నటించింది. సైన్స్ ఫిక్షన్ గా రూపొందింన ఈ చిత్రం రూ.180 కోట్లతో ఆసియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిర్మితమైంది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 1న 2,250 ప్రింట్లతో విడుదల కాబోతోంది. తెలుగులో 500లకు పైగా ప్రింట్లతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, కెమెరా: ఆర్.రత్నవేలు, కళ: సాబు సిరిల్, సౌండ్ ఎఫెక్ట్స్: రసూల్ పూకుట్టి, నిర్మాత: కళానిధి మారన్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శంకర్.


Click it and Unblock the Notifications











