ఐపియల్ రేంజ్ లో ‘రోబో’ విడుదల తొలి టికెట్ వేలంలో గెలుచుకొన్న వీరాభిమాని..
'రోబో" సినిమాకి సంబంధించి గత కొద్ది రోజులుగా రోజుకి ఒక కొత్త వార్త వింటూనే ఉన్నాం. ఇది కూడా అలాంటిదే. తమిళనాడులోని ఆరియాలూర్ అనే ఊళ్ళో వినూత్నంగా రోబో టికెట్ ని వేలానికి పెట్టారు. మామూలుగా ఏదైనా ఒక టికెట్ పెద్ద సినిమా విడుదలయిన రోజున 500 లేదా 1000 రూ పలుకుతుంది. కానీ…3000 ధర పలకడం ఎప్పుడైనా చూశారా?పోనీ విన్నారా?అయితే ఆ వివరాలలోనికి వెలితే...
అరియాలూర్ ఓర్రులోని ఒక థియేటర్ యజమాని కార్తీక్ మాట్లాడుతూ ఐ. పి.యల్ మాదిరిగా 'రోబో' సినిమా విడుదల సందర్భంగా ఏదైనా వినూత్నంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి మొదటి టికెట్ ని వేలానికి ఉంచాం. మేము ఊహించని విధంగా ఎంతో మంది అభిమానులు పోటీపడి వేలంలో పాల్గొన్నారు. షో కి సమయం ఆయినా కారణంగా ఎక్కువ సేపు మేము ఆ వేలాన్ని కొనసాగించలేకపోయాము. ఒక ఔత్సాహిక అభిమాని మూడు వేలంకు తుది పాట పాడి 'రోబో" తొలి టికెట్ ని గెలుచుకున్నాడు అన్నాడు.
మరి రజినీయా మజాకా…..? ఇలాంటి విచిత్రాలన్నీ కేవలం సూపర్‌స్టార్ సినిమాలకే సాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో?


Click it and Unblock the Notifications











