‘రోబో’ పాజిటివ్ టాక్ తో మహేష్, జూ ఎన్టీఆర్ లకు టెన్షన్ స్టార్ట్...
రజనీకాంత్ సినిమా'రోబో" కి మొదటి రోజు వచ్చిన, వస్తున్న పాజిటివ్ టాక్, సూపర్ హిట్ రివ్వ్యూస్ చూసి వచ్చే వారం రిలీజ్ పెట్టుకున్న 'ఖలేజా", 'బృందావనం" బయ్యర్లకి గుబులు పట్టుకుంది. డబ్బింగ్ సినిమానే అయినా కానీ 'రోబో" చిత్రానికి మరీ టూమచ్ టాక్ చెబుతూ ఉండడంతో ఇది ఖచ్చితంగా తదుపరి వచ్చే చిత్రాలను ఎఫెక్ట్ చేస్తుందని బయ్యర్స్ టెన్షన్ పడుతున్నారు.
మహేష్ ఖలేజా అక్టోబర్ 7న విడుదలవుతుందని ఇప్పటికే థియేటర్లలో పోస్టర్లు వేసేయడంతో ఇక అనుమానించాల్సిన అవసరమే లేకుండా ఆ రోజు సినిమా రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేయవచ్చు. అలాగే 14 బృందావనం కూడా రిలీజ్ ఖాయమని అంటున్నారు. ఒక వేళ 'రోబో" ధాటికి బాగా ఎక్కువగా ఉంటే బృందావనం వెనక్కి నెట్టవచ్చు. అయితే ఎన్టీఆర్ పట్టుదలగా ఉన్నాడు కాబట్టి అది జరగదని అంటున్నారు. మరి ఈ రెండు సినిమాలూ వచ్చి రోబోకి షాకిస్తాయో లేక 'రోబో" వల్ల ఆ రెండే షేకవుతాయో అన్నది ఇప్పుడు అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ టెన్షన్ పోవాలంటే అక్టోబర్ 7 వరకు వెయిట్ చేయక తప్పదు.


Click it and Unblock the Notifications











