రవితేజ కొత్త సినిమా షురూ (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా మరో సినిమా మొదలైంది. హన్సిక హీరోయిన్. రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న ఈచిత్రానికి కె.ఎస్.రవీంద్రనాథ్ (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది.

సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ...'ఇంతకు ముందు బలుపు చిత్రానికి రైటర్‌గా పని చేసాను. ఇపుడు డైరెక్టర్‌గా కూడా అవకాశం ఇచ్చారు రవితేజ. టాలెంటు, కసి ఉన్న వారిని ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఈ సినిమాతో నన్నునేను నిరూపించుకుంటాను. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తారు' అని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ...'తెలుగులో నాకు ఇదే తొలి సినిమా. రవితేజ నుంచి నాలుగేళ్ల నుంచి సినిమా చేయాలనుకుంటున్నాను. బాబీ మంచికథ చెప్పారు. కన్నడలో 33 సినిమాలు, తమిళంలో 2 సినిమాలు చేసాను. ఈ సినిమాతో తెలుగులోనూ సక్సెస్ అవుతాననే నమ్మకం ఉంది' అన్నారు.

రవితేజ మాట్లాడుతూ..

రవితేజ మాట్లాడుతూ..


స్ర్కిప్టు పర్ ఫెక్టుగా కుదిరింది. నిర్మాత పాజిటివ్ పర్సన్. అక్కడ ఎలా రాక్ చేసారో, ఇక్కడ కూడా ఈ సినిమాతో రాక్ చేస్తారనే నమ్మకం ఉంది అన్నారు.

కోన వెంకట్ మాట్లాడుతూ...

కోన వెంకట్ మాట్లాడుతూ...


బాబీతో కలిసి ఐదేళ్ల నుంచి సినిమా రంగంలో ప్రయాణిస్తున్నా. బలుపు ఇచ్చిన ఎనర్జీతో ఈ సినిమా చేస్తున్నాం. యూనిట్ సభ్యుల్లో ఎవరిలో ఎంత టాలెంటు ఉందో గుర్తించడంలో రవితేజ పర్ ఫెక్టు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అన్నారు.

నటీనటులు

నటీనటులు


ఈ సినిమాలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణ మురళి, ముఖేష్ రుషి, రావు రమేష్, మిర్చి సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ చిత్రానికి సంగీతం : థమన్, సినిమాటోగ్రఫీ: ఆర్దర్.ఎ.విల్సన్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, మాటలు: కోన వెంకట్, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి, మోహన్ కృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.ఎ.కుమార్ వర్మ, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాథ్(బాబి)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X