Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాకెట్ సింగ్ – “సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్” ఏమైంది?
చక్ దే ఇండియా, అబ్ తక్ చప్పన్ వంటి హిట్ సినిమాలు అందించిన దర్శకుడు షిమిత్ అమిన్ ఈ వారం “రాకెట్ సింగ్ - సేల్స్ మెన్ ఆఫ్ ది ఇయర్" అనే చిత్రంతో మరో సారి ముందుకొచ్చాడు. అలాగే యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ కూడా హీరో కావటంతో మంచి ఓపినింగ్సే వచ్చాయి. అయితే చిత్రం క్రిటికల్ గా ఎక్లైమ్ అయినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ అవ్వటం కష్టమయ్యేలా ఉందని ట్రేడ్ రిపోర్టు. పోస్టర్స్, ప్రోమోలు చూసి ఏ కామిడీనో అని ఎక్సపెక్ట్ చేసి వెళ్ళిన వారికి నిరాశకలిగించటంతో వారే నెగిటివ్ టాక్ ని స్పెర్డ్ చేస్తున్నారంటున్నారు. నిజానికి ఈ సినిమా వారు చెప్పినంత చెత్తగా లేదనదేని నిర్వదాంశం. ఇక గతంలో "ఛక్ దే ఇండియా" సినిమాకు స్క్రిప్ట్ అందించిన జైదీప్ సహాని ఈ సినిమాకి స్క్రిప్ట్ అందించాడు.
ఈ చిత్ర కథలో హర్‌ప్రీత్ సింగ్ బేడి (రణబీర్) డిగ్రీ పూర్తి చేస్కుని ఏవైఎస్ అన్న కంపెనీలో సేల్స్ మెన్ గా చేరతాడు. అది అసెంబుల్డ్ కంప్యూటర్స్ అమ్మే కంపేనీ. అక్కడా ఎన్నో రాజకీయాలు, అవినీతి ఉంటాయి. దాంతో టార్గెట్లు సాధించలేక బాస్ చేత తిట్లు తింటూ, సాటి సేల్స్ మేన్స్ చేత కాగితపు రాకెట్లు వేయించుకుంటూ అవమానించబడుతూంటాడు. ఇలా జరుగుతూండగా ఏం చేయాలో అర్దంకాని స్దితిలో రిసెప్షనిస్ట్ ఇచ్చిన సహకారంతో ఓ కష్టమర్ గురించి తెలుసుకుని సొంతంగా “రాకెట్ సేల్స్ కార్పోరేషన్" స్ధాపిస్తాడు. అక్కడ ఉద్యోగం చేస్తూనే ఆ కష్టమర్ కి మాల్ సప్లై చేస్తాడు. అలా ఎదుగుతూ తను పనిచేస్తున్న కంపెనీకే పోటీగా తయారవుతాడు. అలాంటి పరిస్ధితుల్లో ఆ కంపెనీ ఏం నిర్ణయం తీసుకుంది..అతని కెరీర్ ఎలా సాగిందనే పాయింటుతో స్టైయిట్ గా కథనం సాగుతుంది.