twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాకింగ్ స్క్రిప్టుతో రవితేజ ‘బలుపు’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మాస్ మహారాజ రవితేజకు ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. గతంలో హిట్ చిత్రాలతో హాట్రిక్ కొట్టిన రవితేజ....ఇప్పుడు ప్లాపుల విషయంలో డబుల్ హాట్రిక్ కొట్టాడు.వీర సినిమా దగ్గర నుంచి రవితేజ సినిమాలన్నీప్లాపులే. దీంతో రవితేజ సినిమాలంటే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా తగ్గుతూ వస్తోంది. ఈ క్రమంలో తన కెరీర్ ప్రమాదంలో పడిపోతుందనే విషయం గ్రహించిన రవితేజ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. త్వరలో రవితేజ తన 'బలుపు' చూపించడానికి రెడీ అవుతున్నాడు.

    ఇంతకు ముందు రవితేజతో 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు. 'దూకుడు' సినిమాతో పాటు పలు చిత్రాలకు అదిరిపోయే స్క్రిప్టు అందించిన కోన వెంకట్ ఈ చిత్రానికి ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ తో కూడిన స్క్రిప్టు అందించబోతున్నాడు. ఈ సారి రవితేజకు హిట్టు ఖాయమనే ధీమా ఆ చిత్ర వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

    పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ పొట్లూరి నిర్మించనున్న ఈ చిత్రం షూటింగుకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్లో ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంగీత దర్శకడు తమన్ ఈ చిత్రానికి సూపర్ హిట్ ఆడియో అందించేందుకు కృషి చేస్తున్నాడు.

    ఈ చిత్రంలో రవితేజ క్యారెక్టర్ కామెడీని పండిస్తూ యాక్షన్ సీన్లతో అదరగొట్టేదిగా ఉంటే... శృతి హాసన్ క్యారెక్టర్ రవితేజకు తగిన జోడీగా ఎంటర్ టైన్మెంట్ పంచుతూ అందాల ఆరబోతతో గ్లామరస్‌గా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ 'సార్ వచ్చారు' చిత్రంలో నటిస్తున్నారు. శృతి హాసన్ ప్రస్తుతం ప్రభుదేవా హిందీలో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది.

    English summary
    Mass Maharaja Ravi Teja is currently working for Gopichand Malineni's latest directorial ‘Balupu’. Kona Venkat is providing script and as per a source, the movie will score a sure shot hit as the ace writer offered a full length commercial script for his favorite hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X