Yash's Toxic Motion Poster టాక్సిక్‌గా మారిన యష్.. ఆ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే?
కేజీఎఫ్ సిరీస్ మూవీల తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యష్.. ఆ తర్వాత సినిమా ఏంటి అనేది అందరిలో ఆసక్తి పెరిగింది. లాంగ్ గ్యాప్ తర్వాత యష్ ఎట్టకేలకు తన 19వ సినిమాని అధికారికంగా ప్రకటించాడు. యష్ 19 మూవీకి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేసి.. దానితో పాటు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఆ సినిమా పేరెంటి.. ఏం సర్ ప్రైజ్.. ఆ సినిమా వివరాలు ఏంటి.. ఎలా ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కన్నడ హీరో 'యష్' కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ 2 దాదాపు 1250 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బాక్సాఫీస్ వద్దు టాప్ మూవీగా నిలిచింది. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి సినిమాని ప్రభాస్ తో సలార్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా కూడా ఉంది. కానీ సినిమాలో హీరోగా నటించిన యాష్ మాత్రం సినిమాను అనౌన్స్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నాడు.

ఇక ఎట్టకేలకు యష్.. తన అభిమానులతో వరుస సర్ ప్రైజ్ లు ఇచ్చేశాడు. అభిమానులంతా యష్ 19 సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. యష్ 19 సినిమా టైటిల్, దర్శకుడిని డిసెంబర్ 8న అనౌన్స్ చేస్తామంటూ ప్రకటించారు. ఇక ఈ విషయాలను నేడు రిలీజ్ చేశారు. ముందు నుంచి వినిపిస్తునట్లు యాష్ 19ని మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక ఈ సినిమాకి యష్ కు సరిపోయేవిధంగా పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు. టాక్సిక్ అంటూ టైటిల్ రివిల్ చేశారు. టైటిల్, దర్శకురాలిని రివీల్ చేయడమే కాదు.. మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అదే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2025 ఏప్రిల్ 10న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెకక్కనుంది.
ఇక వీడియో చూస్తుంటే... గోవా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. టాక్సిక్ కి గీతూ మోహన్ దాస్ నే యష్ ఎంచుకోవడానికి ఆమె ట్రాక్ రికార్డు కారణమని తెలుస్తోంది. కమర్షియల్ స్టార్లను డీల్ చేయడంలో అనుభవం లేకపోయినా ఒక డైరెక్టర్ ఆమె కున్న పట్టుకు సాధించిన విజయాలే నిదర్శనమని అందరికి తెలిసిందే. అందుకే కాస్త లేట్ అయినా ఫైనల్ గా సెట్ చేసుకున్నాడు రాకింగ్ స్టార్ యష్. అన్ని ప్రధాన భాషల్లో టాక్సిక్ రాబోతోందని సమాచారం.
ఇక ఈ సినిమా తెరకెక్కించడానికి ఏడాది టైం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా క్యాస్ట్ క్రూ రివిల్ చేయలేదు. ఇక టాక్సిక్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటనేది ఆసక్తిగా మారింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మరోసారి యష్ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా సాయి పల్లవి నటించనుందని అంటున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు చూడాలి మరి.


Click it and Unblock the Notifications











