తెలుగు వాళ్లు దేవుళ్లు, రాజమౌళి సర్ హెల్ప్ చేశారు: ‘కెజిఎఫ్’ సక్సెస్ మీట్లో యష్

Recommended Video

#KGF Grand Success Meet : Yash Great Response On Film Joins Rs.100 Crore Club

తెలుగు ప్రేక్షకులు దేవుళ్లు. నేను ఎవరో తెలియక పోయినా నన్ను స్వీకరించారు. మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను అంటున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యష్. ఆయన నటించిన 'కెజిఎఫ్' చిత్రం కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో విడుదలై భారీ విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో ఆయనా రాష్ట్రాల్లో చిత్ర బృందంతో కలిసి సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు.

తెలుగులో జరిగిన సక్సెస్ మీట్లో పాల్గొన్న యష్ మాట్లాడుతూ... నా గురించి, నా బ్యాగ్రౌండ్ గురించి తెలియక పోయినా నన్ను ఓ స్థాయికి తీసుకెళ్లారు. మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అన్నారు.

 నేనొక ఔట్ సైడర్... అయినా

నేనొక ఔట్ సైడర్... అయినా

నన్ను, నా సినిమాను ప్రమోట్ చేయడంలో మీడియా వారు చాలా హెల్ప్ చేశారు. నేను ఒక ఔట్ సైడర్... కావాలంటే మీరు ననను పట్టించుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ అలా చేయలేదు. ఫస్ట్ డే నుంచి మీడియా వారు మాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ వల్లే మా సినిమా తెలుగునాట అందరికీ రీచ్ అయిందని యష్ తెలిపారు.

 అలాంటి వారికి రెస్పెక్ట్ ఇస్తాను

అలాంటి వారికి రెస్పెక్ట్ ఇస్తాను

సాధారణంగా సక్సెస్ వస్తే అందరూ వస్తారు. సక్సెస్ ముందు ఎవరు ఉంటారో, ఎవరు హెల్ప్ చేస్తారో? సపోర్ట్ చేస్తారో? అలాంటి వారికి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాననని యష్ చెప్పుకొచ్చారు.

మా అన్న సాయి కొర్రపాటి

మా అన్న సాయి కొర్రపాటి

ఎంత మంచి సినిమాకు అయినా ఒక మంచి డిస్ట్రిబ్యూటర్ దొరక్కపోతే అది ప్రజలకు రీచ్ అవ్వదు. ఆ పని మా అన్న సాయి కొర్రపాటిగారు చాలా బాగా చేశారు. ఆయన ఈ సినిమా విషయంలో ఎంత ఎఫర్ట్ పెట్టారో నాకు తెలుసు. థియేటర్ల ఎంపిక దగ్గర నుంచి చాలా కేర్ తీసుకున్నారన్నారు.

రాజమౌళి సర్‌కు ఆ అవసరం లేకున్నా...

రాజమౌళి సర్‌కు ఆ అవసరం లేకున్నా...

ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో రాజమౌళి సర్ చేసిన హెల్ప్ మరిచిపోలేనిది. ఆయన స్థాయి ఏమిటో అందరికీ తెలిసిందే. మా సినిమా గురించి మంచి మాటలు చెప్పాల్సిన అవసరం ఆయనకు లేకున్నా మాకు హెల్ప్ చేశారు. ఆయన తెలుగులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో పాల్గొని మా సినిమా ఇక్కడి ప్రజలకు రీచ్ అవ్వడంలో ముఖ్య భూమిక పోషించారు అని యష్ తెలిపారు.

 మాస్ అంటున్నారు

మాస్ అంటున్నారు

మా సినిమాకు కర్నాటకలో ఎలా రెస్పాన్స్ ఉందో... తెలుగులో కూడా అలాగే ఉంది. డైలాగ్స్ చాలా మాస్‌గా ఉన్నాయని అంటున్నారు. మా సినిమాకు ప్యాన్ ఇండియా వైజ్ మంచి బిజినెస్ జరుగుతోంది. నిర్మాత విజయ్ కిర్గందూర్ వల్లే ఇది సాధ్యమైంది అన్నారు యష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X