రాజకీయ కుట్రే అంటున్న ‘లింగా’ నిర్మాత

By Bojja Kumar

హైదరాబాద్: ‘తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ‘లింగా' చిత్ర డిస్ట్రిబ్యూటర్లు చేస్తున్న ఆందోళనపై నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తీవ్రంగా స్పందించారు. డిస్ట్రిబ్యూటర్ సంతకం చేసిన ఒప్పంద పత్రాలు ప్రకారం వారికి ఎటువంటి పరిహారం చెల్లించనవసరం లేదన్నారు.

డిస్ట్రిబ్యూటర్లు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో......రాక్ లైన్ వెంకటేష్ స్పందిస్తూ....2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సూపర్ స్టార్ రజినీకాంత్ పోటి చేయకుండా అడ్డుకోవడానికి కొందరు ‘లింగా' డిస్ట్రిబ్యూటర్లు పావుల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలకు సేవ చేయడమే రజనీకాంత్ ధ్యేయమని, డిస్ట్రిబ్యూటర్ల చర్యలు పట్ల రజినీకాంత్ కలత చెందారని తెలిపారు.

 Rockline Venkatesh said it is political conspiracy

కాగా..ఈ నెల 27 నుండి ఆమరణ దీక్షకు అనుమతి ఇవ్వాలని డిస్ట్రిబ్యూటర్లు చెన్నై పోలీస్ కమీషనర్‌ను కోరారు. ఇటీవల ఆందోళన కారులు ఒక రోజు నిరాహార దీక్ష చేసి తమ నిరసన తెలిపారు. నిర్మాత రాక్ లైన్ వెంకటేస్ కర్నాటకకు చెందిన వాడు కావడంతో డిస్ట్రిబ్యూటర్లంతా రజనీకాంత్ జోక్యం చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు.

అయితే అభిమానుల వాదన మరోలా ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సంకేతాల నేపథ్యంలో...ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా కుట్ర చేస్తున్నారని, ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. నష్టపోయిన వారు ఏ విషయం అనేది నిర్మాతతో తేల్చుకోవాలి. రజనీకాంత్‌ను బదనాం చేయడం దేనికని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X