'రాక్ స్టార్' మొదటి రోజు కలెక్షన్స్ అక్షరాల రూ 11 కొట్లు
బాలీవుడ్ స్టార్ హీరో రణభీర్ కపూర్ హీరోగా నవంబర్ 11న విడుదలైన 'రాక్ స్టార్' సినిమా మొట్టమొదటి రోజు రూ 11 కోట్లను వసూలు చేసిందని సమాచారం. గతంలో జబ్ ఉయ్ మెట్, లవ్ ఆజ్ కల్ లాంటి అందమైన సినిమాలను తీసిన దర్శకుడు ఇంతియాజ్ ఆలీ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో జాట్ బాయ్ అయినటువంటి రణభీర్ కపూర్ ప్రపంచపు రాక్ స్టార్ జిమ్ మోర్రిసన్ మాదిరి రాక్ స్టార్ కావాలనే కొరికతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టి చివరకు రాక్ స్టార్ ఎలా అవుతాడనేదే కధాంశం.
రాక్ స్టార్ సినిమాలో రణభీర్ కపూర్ సరసన అందాల నటి నర్గీస్ ఫక్రే నటించడం జరిగింది. ఈ సినిమాకి సంగీతం ఆస్కార్ అవార్డు గ్రహీత్ ఎఆర్ రెహామాన్ సమకూర్చడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 11-11-11న విడుదలైన సినిమా అన్ని సెంటర్స్‌లలోను బాక్సాఫీసు రికార్డులను నమోదు చేయడం విశేషం. ఇండియా మొత్తం మీద విడుదలైన అన్ని సెంటర్స్‌లలో అత్యంత అధ్బుతంగా ప్రదర్శించపడుతూ మొట్టమొదటి రోజు రూ 11.25 కొట్లను విడుదల చేయడం జరిగింది.
ఈ సినిమాలో రణభీర్ కపూర్ చేసినటువంటి నటనకు గాను అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. ఈ సందర్బంలో ఈ సినిమా నిర్మాతలు ఈరోష్ ఇంటర్నేషనల్ , శ్రీ అష్ట వినాయక సినీ విజన్ వారు మాట్లాడుతూ రాక్ స్టార్ సినిమాని నిర్మించడానికి గాను సుమారు 60 కొట్లు వరకు ఖర్చు పెట్టడడం జరిగింది. అంతేకాకుండా ఈ సినిమాని దర్శకుడు ఇంతియాజ్ ఆలీ ఢిల్లీలోని సెయింట్ స్ఠీఫెన్స్ కాలేజీ, నిజాముద్దీన్‌లలో తెరకెక్కించిన సీన్లు ఆడియన్స్ నుండి పెద్ద ఎత్తున స్పందనకు నోచుకున్నాయని తెలిపారు.


Click it and Unblock the Notifications











