twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గీతాంజలి' లో 'లేచిపోదామా..' అనే గొంతు నాదే

    By Srikanya
    |

    హైదరాబాద్ : 1989లో వచ్చిన మణిరత్నం గారి 'గీతాంజలి' బాక్సాఫీసు రికార్డు బద్దలు కొట్టింది. ఆ సినిమాకీ, నాకూ సంబంధం ఏంటనుకుంటున్నారా! దాన్లో 'లేచిపోదామా..' అంటూ వినిపించే గొంతు నాదే. గిరిజకు గొంతు అరువిచ్చా. ఆ పాత్ర తీరుకు తగ్గట్టు గొంతు ఉండాలని మణిగారు చాలా తపన పడ్డారు. అప్పటికే నలుగుర్ని టెస్ట్‌ చేశారు కూడా. అయినా ఓకే అవలేదు. ఆ సమయంలో 'నాలుగుస్తంభాలాట' సినిమాకు పనిచేసిన పాణిగారని ఒకతను మణిరత్నం గారికి నా పేరు సూచించారు అంటూ ప్రముఖ నటి రోహిణి తన డబ్బింగ్ ప్రస్దానాన్ని వివరించారు.

    అప్పుడు నేనొక షూటింగ్‌లో ఉండగా మణిగారి నుంచి ఫోనొచ్చింది. తీరా వెళితే ఈ విషయం చెప్పారు. నేను డబ్బింగ్‌ చెప్పడం ఏంటి అనుకున్నా. మనసులో చెప్పొద్దనీ అనుకున్నా. కానీ ఆయన సినిమా తీసిన తీరు చూశాక, కాదని చెప్పలేకపోయా. ప్రత్యేకంగా శిక్షణ తీసుకోకుండానే సహజంగా డబ్బింగ్‌ చెప్పా. నా గొంతుకు విపరీతమైన స్పందన వచ్చింది. తరవాత 'శివ'లో అమలకు చెప్పమని వర్మ పిలిచారు. అదేంటి, నన్ను డబ్బింగ్‌ ఆర్టిస్టు అనుకుంటున్నారా ఏంటి, ఎందుకు అందరూ ఇలా పిలుస్తున్నారని బాధనిపించింది. తరవాత నా గొంతు ప్రత్యేకత అది అని తెలుసుకొని డబ్బింగ్‌ చెప్పడానికి ముందుకొచ్చా. దాంతో వేరే భాషల్లో కూడా అవకాశాలొచ్చాయి.

    రేవతి, జ్యోతిక, ఐశ్వర్యారాయ్‌... వంటి తారలకీ నా గొంతు అరువిచ్చా. తెలుగు దర్శకుడు గుణశేఖర్‌ గారు నా గొంతుకు వీరాభిమాని. తను దర్శకత్వం వహించిన 'సొగసు చూడతరమా'లో నన్నొక పాట పాడమన్నారు. వద్దన్నా ఎంత చెప్పినా వినకపోవడంతో నేను పాట పాడాను, కానీ దాన్ని సినిమాలో వాడలేదు. అయితే ఆ రకంగా, పాట పాడే కోరిక మాత్రం తీరింది. మీకు ఇంకో విషయం చెప్పాలి... రావన్‌లో ఐశ్వర్యారాయ్‌కి డబ్బింగ్‌ చెప్పినప్పుడు బాగా అరవాల్సి వచ్చింది. దాంతో స్వరపేటిక దెబ్బతింది. డాక్టర్లు 'ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది' అని సూచించారు. ప్రస్తుతం కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే నాకు నేను డబ్బింగ్‌ చెప్పుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చింది రోహిణి.

    English summary
    Rohini's parallel career, as a dubbing artist, was also an accident. An associate of Mani Ratnam suggested her name when the director was looking for a voice for the heroine of “Geetanjali”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X