వెళ్ళగానే కమిట్‌మెంట్ అడిగారు.. ఛాన్స్ ఇస్తా నాకేంటి అంటూ.. బిగ్ బాస్ రోహిణి షాకింగ్ కామెంట్స్
Recommended Video
'బిగ్ బాస్' రియాలిటీ షో.. బుల్లితెర ఆడియన్స్‌ని ఆకట్టుకుంటూ ఆసక్తికరంగా సాగిపోతున్న షో. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం మూడో సీజన్‌లో ఉంది. పలు వివాదాల నడుమ ప్రారంభమై సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న ఈ షో నుంచి నాలుగో వారం రోహిణి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ అనంతరం పలు మీడియా సంస్థలతో ముచ్చటించిన రోహిణి గ్లామర్ ఫీల్డ్‌లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి పోతే..

టీవీ ఆర్టిస్టుగా ఫుల్ ఫేమస్
టీవీ ఆర్టిస్టుగా ఫుల్ ఫేమస్ అయింది రోహిణి. పలు టీవీ సీరియల్స్ లో తనదైన నటనతో బుల్లితెర ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈమె 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయింది. ఈ నేపథ్యంలో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 3 లో సెలెక్ట్ అయి గత వారం ఎలిమినేట్ అయింది.

ఆడిషన్స్‌కి వెళ్లగా కమిట్‌మెంట్
తాను సీరియల్ ఛాన్సుల కోసం ఆడిషన్స్‌కి వెళ్లగా కాస్టింగ్ కౌచ్ ఉదంతాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ గ్లామర్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను సీరియల్స్‌కి రాకముందే బీ టెక్ పూర్తి చేసి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వచ్చి ఇలా సినీ ఇండస్ట్రీలో సెట్ అయ్యానని చెప్పింది రోహిణి. అయితే తాను ఆడిషన్స్‌కి వెళ్లగా ఓ ఇద్దరు కమిట్‌మెంట్ అడిగారని తెలిపింది.

ఇంట్లో వాళ్ళు చెప్పినా వినలేదు
తాను సినీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నానని తెలియగానే తమ కుటుంబ సభ్యులు ససేమిరా వద్దన్నారని చెప్పింది రోహిణి. తనను అనకూడని మాటలన్నారని, అలాంటి బతుకులు మనకు అవసరమా? అని కూడా తిట్టారని పేర్కొంది. అయితే అలాంటివేమీ ఉండవని, అందరికీ నచ్చజెప్పి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని తెలిపింది రోహిణి.

ఛాన్స్ ఇస్తా.. మరి నాకేంటి? అన్నారు
కెరీర్ ప్రారంభంలో ఆడిషన్ కోసం ఓ ఆఫీస్ కి వెళ్లగా.. కమిట్‌మెంట్ అడిగారని, కానీ తానిచ్చిన రిప్లైని బట్టి అక్కడ ఇష్యు క్లోజ్ అయిందని చెప్పింది రోహిణి. ఇక కొన్ని రోజులకు మరో ఆడిషన్ కి వెళ్లగా అక్కడున్న ఒక ఏజ్డ్ పర్సన్ నీకు ఛాన్స్ ఇస్తా కానీ నాకేంటి? అని అడిగారు. అక్కడ కూడా సింపుల్ గా రిజెక్ట్ చేసి వచ్చేశానని తెలిపింది రోహిణి.


Click it and Unblock the Notifications











