రోహిత్ సంధిస్తున్న 'బాణం' నేడే
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు తమ్మడు నారా రామ్మూర్తి నాయుడి తనయుడు నారా రోహిత్ 'బాణం' చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమౌతున్న సంగతి తెలిసిందే. అశ్వనీదత్ కుమార్తెలు నిర్మాణం చేతబట్టి 'త్రీ ఎంజెల్స్' పతాకం పై రూపొందిస్తున్న మొదటి చిత్రం ఇది. నూతన దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. రోహిత్ సరసన 'ముని' ఫేం వేదిక కథానాయికగా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు(సెపెంబరు 16) విడుదలవుతోంది.
నారా వారి కుటుంబం నుండీ పరిచయమౌతున్న తొలి నటుడు రోహిత్ ను చూసి చంద్రబాబు నాయిడు పరమానందపడిపోతున్నాడు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్రం గురించి మాట్లాడిన చంద్రబాబు "ఈ చిత్రం మంచి సందేశంతో కూడిన వినోదాత్మక చిత్రమని" చెప్పారు. వెంకటేశ్, మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి నటులు పరిచయమైన అశ్వనీదత్ సమర్పణలో రోహిత్ పరిచయమవడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని మనం కూడా ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ రోహిత్....


Click it and Unblock the Notifications











