రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్.. నటుడి పోస్ట్‌పై నెటిజన్స్ ఫైర్
ఒక్కోసారి జోకులు మిస్ ఫైర్ అవుతుంటాయి. కామెడీ చేద్దామని, అందర్నీ నవ్వించడానికి చేసే ప్రయత్నాల్లో ఒక్కోసారి మనమే బొక్క బోర్లా పడతాము. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు చేసిన ఓ పని నెటిజన్లకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఆయన్ను టార్గెట్ చేస్తూ దాడి చేయడంతో దెబ్బకు దిగి వచ్చి క్షమించమని అడిగాడు. ఇంతకీ ఆయన చేసిన పోస్ట్, నవ్వించేందుకు చేసిన ప్రయత్నం ఏంటో ఓసారి చూద్దాం.

కరోనా కలకలం..
ప్రస్తుతం అసలే పరిస్థితులు బాగోలేవు. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. వైరస్‌ను కట్టడి చేయలేక అందరూ చేతులెత్తిసినట్టు కనిపిస్తోంది. దాదాపు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు భారతదేశంలో నమోదు అయ్యాయి. ఇలాంటి పరిస్థితో కరోనాతో జోకులంటే వ్యవహారం మామూలుగాఉండదు.

నటుడి పోస్ట్ వైరల్..
బాలీవుడ్ నటుడు రోహిత్ రాయ్ చేసిన ఓ పోస్ట్ అందర్నీ భయాందోళనకు గురి చేసింది. అయితే ఆయన మాత్రం అందర్నీ నవ్వించేందుకు అలాంటి పోస్ట్ చేసినా.. కూడా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సూపర్ స్టార్ రజినీకాంత్‌పై చేసిన ఆ పోస్ట్‌పై నెటిజన్లు భగ్గుమన్నారు.

రజినీకాంత్‌కు కరోనా...
రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.. అయితే కరోనా వైరస్ క్వారంటైన్‌లో చేరింది. అని ఓ పోస్ట్ చేశాడు. దీంట్లో ఉద్దేశం మంచిదే అయినా.. రజినీ దెబ్బకు కరోనాయే క్వారంటైన్‌లో చేరిందనే సందేశమున్నా ప్రస్తుత పరిస్థితిలో ఇది మిస్ ఫైర్ అయింది.
Recommended Video

క్షమించమన్న నటుడు..
వివాదాస్పదమైన ఈ పోస్ట్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో రోహిత్ క్షమించమని అడిగాడు. తాను కేవలం నవ్వించడానికి మాత్రమే చేశానని, కామెంట్ చేసే ముందు కాస్త ఆలోచించండని కోరాడు. బాధపెట్టడానికి ఈ పోస్ట్ చేయలేని తనను క్షమించమని కోరాడు.


Click it and Unblock the Notifications











