రోహిత్ శెట్టి నెక్స్ట్ ఆ సౌత్ రీమేక్

విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన 'సూదు కవ్వుమ్' తమిళంలో చక్కటి ఆదరణ పొందింది. దీంతో ఆ చిత్రం మలయాళంలో కూడా రీమేక్ అవుతోంది. అన్ని ప్రాంతాలకు తగ్గట్టుగా ఉండే ఆ కథపై తాజాగా హిందీ దర్శకుడు రోహిత్‌శెట్టి మనసుపడ్డాడట. ఆ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకొన్న రాక్‌లైన్ ప్రొడక్షన్స్‌తో కలిసి రోహిత్‌శెట్టి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నారు.
ఇందులో హీరో,హీరోయిన్స్ గా ఇమ్రాన్‌ఖాన్, శ్రద్ధాకపూర్‌లను ఎంచుకొన్నట్టు ఆ సినిమావర్గాలు వెల్లడించాయి. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందట. ఇదివరకు రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన షారుఖ్ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' పూర్తిగా దక్షిణాది వాసనలతో సాగుతుంది. అందులో షారుఖ్, దీపికా పదుకొణేలతో లుంగీ డ్యాన్స్ వేయించి అలరించారు.
మరో ప్రక్క 'బలుపు' సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది పీవీపీ సినిమా సంస్థ కూడా 'సూదు కవ్వుమ్' పై దృష్టి పెట్టారు . ఆ క్రమంలో కిడ్నాప్ డ్రామా నేపధ్యంలో రూపొందిన సూది కవ్వం రైట్స్ తీసుకున్నారు. 2013 లో సూది కవ్వం చిత్రం ఘన విజయం సాధించింది. 'బలుపు' సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో తెలుగునాట విరివిగా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











