నారా రోహిత్.. ఇంతలా మారిపోయాడా?: చూశారా ఎలా చిక్కిపోయాడో..
నారా రోహిత్.. కెరీర్ మొదటినుంచి విభిన్న కథాంశాలను, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్నాడు. సినిమాలు, నటన విషయంలో ఓకె కానీ.. ఆహార్యం విషయంలో మాత్రం రోహిత్ కాస్త అశ్రద్ద కనబరిచినట్టు అనిపిస్తుంది.
ముందు నుంచి కాస్త లావు గానే ఉండే రోహిత్.. కొన్ని సినిమాల్లో మరీ ఎబ్బెట్టుగానూ కనిపించాడు. ఈమధ్య దీనిపై కాస్త గట్టిగానే ఫోకస్ చేసిన రోహిత్.. వర్కౌట్స్ ద్వారా దాదాపు 10కేజీలు తగ్గిపోయాడట. తాజాగా బయటకొచ్చిన రోహిత్ ఫ్రెష్ లుక్ చూస్తుంటే.. స్లిమ్‌గా కనిపిస్తున్నాడు.

రోహిత్ త్వరలోనే వెంకటేశ్ కాంబినేషన్ లో తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా కోసమే ఇలా బరువు తగ్గాడట. దర్శకుడు తేజ సూచనల మేరకు పది కిలోలు తగ్గినట్టు తెలుస్తోంది.
ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో వెంకీ ప్రొఫెసర్ గా కనిపించబోతున్నారట. వెంకీ -రోహిత్‌లు బావ-బామ్మర్దులుగా కనిపిస్తారని టాక్. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.


Click it and Unblock the Notifications











