చిరంజీవి సిగ్గుపడ్డారు.. అందుకే నేను రెచ్చిపోయా.. ఎవర్‌గ్రీన్ సాంగ్‌పై రోజా కామెంట్స్
చిరంజీవితో సరితూగే గ్లామర్, గ్రేస్ ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రోజా ఒకరు. రోజా-చిరంజీవి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే అందులో వీరిద్దరిపై చిత్రీకరించిన పాటలు, వేసిన స్టెప్పులు మరో ఎత్తు. అప్పటి వరకు రోజా సినీ రంగానికి వచ్చి, అడపాదడపా చిత్రాలు చేస్తున్నా.. చిరంజీవితో ముఠామేస్త్రీ సినిమాలో అవకాశం రావడం చాలా లక్కీనే. ముఠామేస్త్రీలోనే చిరుకు సరిసమానంగా నటనలో, డ్యాన్సుల్లోనూ ఇరగదీసిన రోజా వాటి వెనుక విశేషాలను తాజాగా పంచుకుంది.

ఆ ఈవెంట్‌లో..
వినాయక చవితి సందర్భంగా 2020 అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారమైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో రోజా, సునీల్, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి వంటి వారు అతిథులుగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో చిరు బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేశారు. ఆ వేడుకలో భాగంగా రోజా నాటి సంగతులను గుర్తు చేసుకుంది.

అందరూ భయపెట్టారు..
ముఠామేస్త్రీ సినిమా షూటింగ్ విశేషాలను రోజా చెబుతూ.. చిరంజీవితో నటించడం, డ్యాన్సులు చేయడం చాలా కష్టం, జాగ్రత్తగా వ్యవహరించమని సెట్‌లో అందరూ భయపెట్టారు. అయితే అలా చిరంజీవి గారు ఎంట్రీ ఇచ్చారు.. ఎంతో సింపుల్‌గా వచ్చి మాట్లాడారు. మొదటి రోజే సాంగ్ షూట్.. అది కూడా ఎంత ఘాటు ప్రేమయో అనే పాట. ఆ పాట ఎంతో పేరును తీసుకొచ్చిందని తెలిపింది.

రెచ్చిపోయాను..
చిరంజీవితో నాకు రొమాంటిక్ సాంగ్స్, ఈలలు వేసే మాస్ సాంగ్ కూడా పడ్డాయి. అదే సినిమాలో మామా మామా అనే మాస్ సాంగ్ ఓ రేంజ్‌లో హిట్టయింది. ఆ పాట షూటింగ్ సమయంలో చిరంజీవి దీక్షలో ఉన్నారు.. రొమాంటిక్ షాట్ చేసేందుకు సిగ్గుపడ్డారు. ఇక అదే దొరికిన ఛాన్స్ అని నేను రెచ్చిపోయాను అందుకే ఆ సాంగ్‌లో పోటాపోటీగా నటించాను అని రోజా చెప్పుకొచ్చింది.

అమ్మో ఈ అమ్మాయిను నమ్మద్దు..
అయితే నేను ప్రాక్టీస్‌లో ఓ మూమెంట్ చేస్తే సెట్‌కు వచ్చే సరికి దాన్ని కొంచెం మార్చేదాన్ని. అలా చేసేసరికి ‘అమ్మో ఈ అమ్మాయిను నమ్మద్దు.. ప్రాక్టీస్ ఒకలా చేస్తోంది..కెమెరా ముందు ఒకలా చేస్తోంది' అని చిరంజీవి అన్నారు. చిరంజీవి గారితో నేను చేసిన పాటల్లో రాజశేఖరా.. అనే పాట మంచి పేరును తీసుకొచ్చిందని రోజా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











