మొత్తానికి మహేష్ బాబు బాగానే రోజాకు ఉపయోగపడుతున్నాడు
ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వాడే జగన్ అంటూ రోజా..మహేష్ బాబు పోకిరి చిత్రంలోని డైలాగులు విసురుతోంది. ఈ డైలాగు విసిరినప్పుడు సభికులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ పార్టీ నాయకురాలిగా ప్రజల్లోకి వెళ్థున్న రోజా ఈ డైలాగులని చెప్పి జనాల్ని బాగానే ఉత్సాహపరుస్తోంది. తన సినిమా టెక్ వాగ్దాటితో, డైలాగులతో అదరకొడ్తోంది. అలాగే చిరంజీవి, చంద్రబాబులు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ తొడగొడుతున్నారని, మీసాలు తిప్పుతున్నారని, వారేకేనా పౌరుషం ఉంది, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగిన మీకెంత పౌరుషం ఉండాలి. మీకేం తక్కువ పౌరుషం లేదు. కనుక మీరు కూడా మీసాలు తిప్పండి, తొడగొట్టండి అంటూ మాట్లాతున్నప్పుడు జనంలో చప్పట్లు మార్మోగుమోతున్నాయి. రోజా అప్పట్లో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా, ఇప్పుడు జగన్ పార్టీ నాయకురాలిగా బాగా రాణిస్తోంది. పంచ్ డైలాగులతో, పొలిటికల్ సెటైర్స్ తో రోజా తన ప్రసంగాలతో జనాన్ని ఉర్రూతలూగిస్తోంది. అలా పోకిరి డైలాగులు ఆమెకు బాగా ఉపయోగపడుతున్నాయి. మహేష్ తో సినీ కెరీర్ లో నటించలేకపోయిన ఆమె ఇలా మహేష్ డైలాగులును చెప్పుకుంటూ ఓట్లు సంపాదించే దిసగా ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











