మళ్ళీ 'ఇత్తడైపోద్ది' అంటున్న మాజీ హీరోయిన్ రోజా
వినోద్ కుమార్ సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలో అప్పటి యంగ్ హీరోయిన్ రోజా..ఇత్తడైపోద్ది అనే డైలాగుతో అదరకొట్టారు. అప్పట్లో ఇదో ఊత పదంగా కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ ఇన్నాళ్ళకు రోజా మళ్ళీ ఇత్తడైపోద్ది అనే మ్యానరిజంను మళ్ళీ ఉపయోగించనున్నారు. తనీష్, అంచల్ జంటగా రూపొందుతున్న కోడిపుంజు చిత్రంలో ఆమె హీరో తల్లిగా ఈ డైలాగు చెప్తూంటుంది..డీఎస్ రావు సమర్పణలో శ్రీ శైలేంద్ర సినిమాస్ పతాకంపై ఎస్. బుజ్జిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి బీవీవీ చౌదరి దర్శకుడు. రీసెంట్ గా ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా మీడియాకు ఈ చిత్ర విశేషాలను దర్శకుడు తెలియజేస్తూ..పందేనికి రెడీ అనే ఈ చిత్రం ఉపశీర్షికతోనే చిత్రం ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు లవర్ బాయ్ గా అందరికీ తెలిసిన తనీష్ తొలిసారిగా ఈ చిత్రంలో యాక్షన్ ఎలిమెంట్ ను అటెంప్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయనకు యాక్షన్ ఇమేజ్ కూడా జత అవుతుంది. దగ్గుబాటి సీతారత్నం పాత్రలో రోజా నటిస్తున్నారు. ఆమె పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా వుంటుంది అన్నారు. ఈ నెల 17 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు.
శివకృష్ణ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, రాళ్ళపల్లి, డా. శివప్రసాద్, రాజ్యలక్ష్మి, సత్యప్రకాష్, ఆదిత్యమీనన్, ధన్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: తాళ్ళపాక నాగరాజు, శ్రీరామ్ చౌదరి, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శివకుమార్, సహనిర్మాతలు: సుదర్శన్ రెడ్డి, ఈశ్వర్ సీహెచ్‌వీఎన్.


Click it and Unblock the Notifications











