'హోమ్ మినిష్టర్' గా రోజా
ఏంటీ కనీసం ఎమ్మేల్యేగా కూడా ఎన్నికకాని రోజా హోమ్ మినిష్టర్ ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా, నిజానికి రోజాకు అంతసీన్ లేదన్నది జగమెరిగిన సత్యం. ఇన్నాళ్లు టిడీపీలో వుండి కాంగ్రెస్ ను విమర్శించిన రోజా తానిక ఎమ్మేల్యే కావడం పగటికలే అనుకుందో ఏమో రాత్రికి రాత్రి పార్టీ ఫిరాయించింది. కాంగ్రెస్ తనకు ఎమ్మేల్యే టికెట్ ఇస్తుందో లేదో కానీ ప్రస్తుతం కాలీగా వున్న రోజా మాత్రం సినిమాల్లో నటిస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకొంటోందట.
ఆమె ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న 'శంభో శివ శంభో' చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. విశ్వసనీయ కథనం ప్రకారం ఇందులో రోజా హోమ్ మినిష్టర్ గా కనిపిస్తారని తెలిసింది. మొత్తం మీద నిజజీవితంలో అందని ద్రాక్షే అయిన మంత్రి పదవిని కనీసం వెండి తెరపైనైనా అనుభవించనీ అని ఫిలిం నగర్ లో సెటైర్ల వినబడుతున్నాయి.
roja home minister tdp congress ravi teja shambo shiva shambo allari naresh shiva balaji రోజా హోమ్ మినిష్టర్ టిడీపీ కాంగ్రెస్ శంభో శివ శంభో రవితేజ అల్లరి నరేష్ శివ బాలాజీ


Click it and Unblock the Notifications