గ్యాప్ తర్వాత బాలకృష్ణ సినిమాలో రోజా నటిస్తోంది
బాలకృష్ణ, రోజా కాంబినేషన్ లోగతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే రోజా రిటైరై రాజకీయాల్లోకి వచ్చాక వారి మధ్య దూరం పెరిగింది. అయితే రోజా రీసెంట్ గా సినిమాల్లో హీరోయిన్ తల్లి వేషాలు వేస్తూ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అది దృష్టిలో పెట్టుకునేనేమో బాలకృష్ణ తన తాజా చిత్రం శ్రీరామ రామ రాజ్యంలో ఆమెకు అవకాశమిచ్చారు. బాపు దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీరామరాజ్యం సినిమాలో రోజా భూదేవి పాత్రలో నటిస్తుంది. ఈసినిమాలో రాముడుగా బాలకృష్ణ నటిస్తుండగా, సీతాదేవిగా నయనతార, వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్నారు. ఇళయరాజా, బాపుల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా రామోజీఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











